All meadia

 

Friday, 28 November 2014

హయత్ నగర్ లో అదృశ్యమైన విద్యార్థి ఉదయ్ కిరణ్ హత్య

తెలంగాణ వెబ్,న్యూస్;హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం అపహరణకు గురైన ఎడో తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్ (13) దారుణ హత్యకు గురయ్యాడు.బాటసింగారం గ్రామానికి చెందిన కొడిశెల్ల పెంటయ్య ఏకైక కుమారుడు ఉదయ్ కిరణ్ (13) పెద్ద అంబర్ పేట రాజ శ్రీ విద్యా మందిర్ లో ఏడో తరగతి చదువుతున్నాడు.గురువారం సాయంత్రం పాఠశాల విడిచినఅనంతరం ఇంటికి వెళ్లేందుకు బస్టాప్ వద్ద వేచి ఉండగా ,గుర్తుతెలియని వ్యక్తి ఉదయ్ కిరణ్ ను ద్విచక్రవాహనం పై అపహరించుకుపోయాడు.అనంతరం  నాగోల్ సమీపంలోని మన్సురాబాద్ చెరువు వద్దకు తీసుకెళ్లిహత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేశాడు.

No comments:

Post a Comment