పిల్లలకు స్కాలర్ షిప్ లు అందజేస్తున్న మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణ వెబ్ న్యూస్, సనత్ నగర్: తండ్రి లేని వితంతు పిల్లలకు చదువుకోవడానికి లూంబా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్ షిప్ లు మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి పంపిని చేశారు. సనత్ నగర్ సేయింట్ థెరిస్సా పాఠశాలలో శుక్రవారం ఆయన స్కాలర్ షిప్ ల పంపిని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మానవత దృక్ఫదంతో అందజేస్తున్న సహాయాన్ని ఉపయోగించుకొని విద్యలో పైకి రావాలని పిలుపునిచ్చారు. పాఠశాల విద్య అనంతరం కళాశాల విద్య కొనసాగించేందుకు కూడా ప్రోత్సాహం అందించడానికి ప్రయత్నం చేయాలని నిర్వాహకులను కోరారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థుల మొత్తం 120 మందికి విద్యార్థులకు 3000 రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎస్ కె. అయుబ్ ఖాన్, మహేశ్వరి, కిరణ్ మహి, సేయింట్ థెరిస్సా కరస్పాండెంట్ సుజాత, రవీందర్ రెడ్డి, పి.నరేందర్, గోపిలాల్ చౌహాన్, దాడి ప్రవీన్ రెడ్డి, పి.సంధ్య, లలితా చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment