All meadia

 

Wednesday, 15 April 2015

Wi-Fi launching at hussainsagar on 16th april

హైదరాబాద్ లో  ఉచిత వైపైని ప్రారంభించనున్న ఐటిశాఖ మంత్రి కె.తారకరామారావు

Ø  రేపు తొలి దశ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని ప్రారంభిచనున్న మంత్రి

Ø ఉచిత వై-ఫైతో యూనియన్ ఐటిశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఫేస్ టైం కాల్ లో ముచ్చటించనున్న మంత్రి

Ø ఈ విడియో కాల్ ద్వారా  ముచ్చటించనున్న మంత్రులు

హైదరాబాద్ లో ఉచిత వైపై సేవలను  రేపు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించబోతున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టు ప్రయోగాత్మకంగా, పైలట్ ప్రాజెక్టు ప్రాతిపాతికన ప్రారంభించబోతున్న ఈ ఉచిత వైఫై సేవలను రేపు సాయంత్రం 5-15 కి హోటల్ మారియట్ లో జరిగే కార్యక్రమంలో లాంచనంగా ప్రారంభిస్తారు.   ఉచిత వై-ఫైతో యూనియన్ ఐటిశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఫేస్ టైం కాల్ లో మంత్రి కె.తారక రామా రావు మాట్లాడానున్నారు. ఈ వీడియో కాల్ తోనే హైదరాబాద్ లో ఉచిత వైపై సేవలు లాంచనంగా ప్రారంభమౌతాయి.

 ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బియస్ యన్ ఏల్ తోకలిసి క్వాడ్ జెన్ కంపెనీ ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించబోతున్నది. జిహెచ్ యంసి కమీషనర్, యంచండిఏ కమీషనర్, బియస్ యన్ యల్ సియండి, క్వాడ్ జెన్ చైర్మన్లు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోనబోతున్నారు. ఇప్పటికే బియస్ యన్ ఏల్, క్వాడ్ జెన్ కంపెనీ ఉన్నాతాధికారులు తుది ఏర్పాట్లను పరిశీలించారు. హుస్సెన్ సాగర్ పరిసారాల్లోని ట్యాంకుబండ్ , లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్డులో సుమారు 1800 నుంచి 2500 మంది పౌరులు ఈ సేవలను ఓకేసారి లాగిన్ కావచ్చు. హుస్సేన్ సాగర్ చుట్టు సూమారు 10 కీలోమీటర్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఉచితంగా 30 నిముషాలపాటు పైఫై సేవలు పొందవచ్చు... సరాసరి 2 యంబిపియస్ నుంచి 20 యంబిపియస్ వరకి వేగంతో ఉచిత వైపై పనిచేస్తుంది

          

No comments:

Post a Comment