తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణలో విద్యుత్ కోతలు లేనందున వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను పంచాతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని,ప్రభుత్వం ఇప్పటికే 2015 వేసవి తాగునీటి సమస్యల నివారణ ప్రణాళిక కింద రూ.263 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు.వీటిని పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు.సచివాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య సమీక్షలో ఆయన మాట్లాడారు.కేటాయించిన నిధులు సరిపోకపోతే మరిన్ని ఆదనపు నిధులు మంజూరు చేస్తామన్నారు.ఏఒక్క గ్రామంలోనూ తాగునీటి సమస్య రాకుండా చూడాలని కోరారు.గ్రామాల్లో తాగునీటి సరఫరా జరుగుతున్న తీరుపై ప్రతిరోజు నివేదికలు తెప్పించుకుని పర్యవేక్షించాలని తెలిపారు.
No comments:
Post a Comment