All meadia

 

Sunday, 26 April 2015

నేపాల్ నుంచి తెలంగాణ ప్రజలను రపించేందు మంత్రి KTR చర్యలు

                                       

నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలను స్వరాష్ట్రానికి రప్పించేందుకు  ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. నేపాల్ లోని భరత్ పూర్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్న 50 మంది తెలంగాణ విద్యార్థులని స్వస్థలాలకు రప్పించేందుకు... విదేశాంగ శాఖ అధికారులతో పాటు...ఢిల్లీ లోని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కరీంనగర్, వరంగల్ , హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఈ 50 మంది విద్యార్థులు నేపాల్ భూకంపంలో చిక్కుకున్నారు. వీళ్లు చదువుతున్న కళాశాల యాజమాన్యం వారిని నేపాల్ సరిహద్దుల వరకు ప్రత్యేకంగా ఒక బస్సు ద్వారా పంపుతున్నదని , అక్కడినుంచి వారిని సాధ్యమైనంత త్వరగా సొంతప్రాంతాలకు తీసుకొచ్చేందుకు అందుబాటులో ఉన్న విమాన, రైలు సౌకర్యాలని ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఢిల్లీ లోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ తో మాట్లాడారు. నేపాల్ సరిహద్దులోని గోరఖ్ పూర్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి విద్యార్థులను అక్కడ రిసీవ్ చేసుకోవాలని కోరారు.  ప్రకృతి వైపరిత్యంలో చిక్కుకున్న విద్యార్థులకు  ఎలాంటి ఆందోళనా అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని  మంత్రి విద్యార్థులతో తెలిపారు. గంభీరమైన పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు కొంత ధైర్యంగా వ్యవహరించాలని చెప్పారు. మంత్రి స్వయంగా చొరవ తీసుకోవడంతో విద్యార్థులు కొంత రిలీఫ్ అయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మంత్రి మాట్లాడి ఎలాంటి ఆందోళనా చెందవొద్దని.. విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత తమదని హామీఇచ్చారు. విద్యార్థుల క్షేమ సమాచారాలు తల్లిదండ్రులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు తెలంగాణ వారు నేపాల్ లో ఎవరు చిక్కుకున్నా ప్రభుత్వం వారికి సాయం చేస్తుందని తెలిపారు. నేపాల్ లో తెలంగాణ వారు ఎవరైనా చిక్కుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. 

No comments:

Post a Comment