All meadia

 

Wednesday, 1 April 2015

ప్రభుత్వానికి కృతజ్ఞతలు : కాన్సర్ వ్యాధి తో బాద పడుతున్న జర్నలిస్ట్ మిత్రుడు కొప్పుల నాగరాజు కు టి యు డబ్లు జె కృషి తో ప్రభుత్వం 8.50 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధిని మంజూరు చేసింది. ఇండియన్ ఎక్ష్ ప్రెస్ లో పనిచేస్తూ కొన్ని సంవస్తరాలుగా అనారోగ్యానికి గురయ్యారు. బసవతారకం ఆస్పత్రిలో చికిస్థ పొందుతున్న కొప్పుల నాగరాజు ఆరోగ్యం ఇప్పుడు విషమంగానే వుంది. చిన్న తనం లో తండ్రిని కోల్పోయిన నాగరాజు ఆర్ధిక పరిస్థితి దయనీయంగా వుంది. ఇప్పటి వరకు సొంత ఖర్చులతో వైద్యం చేసుకుంటున్న నాగరాజుకు టి యు డబ్లు జె అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ మంత్రులు ఈటెల రాజేందర్, కె. టీ ఆర్ ల చొరవతో 8.50 లక్షల ను సీ ఏం రిలీఫ్ కింద మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జర్నలిస్ట్ ను ఆదుకున్న ముఖ్య మంత్రి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం జర్నలిస్ట్ ల సంక్షేమం పట్ల ఇదే ధోరణి తో వ్యవహరిస్తోందని.... ఆశిస్తూ మరో మారు మాకు సహకరించిన కె టి ఆర్ గారికి ఈటెల రాజేందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది రాష్ట్ర కమిటి. - క్రాంతి కిరణ్ జనరల్ సెక్రటరీ

..

No comments:

Post a Comment