All meadia

 

Thursday, 30 April 2015

మే 5 నుంచి 2 వారాలు యుఎస్ లో మంత్రి కె టి.ఆర్ పర్యటన

రెండు వారాల అమెరికా పర్యటనకి ఐటి మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు
 తెలంగాణకి  భారీ పెట్టుబడులే లక్ష్యం
 సాంకేతిక మరియు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ
 ఐటి, ఫార్మ మరియు ఏలక్ర్టానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై ప్రత్యేక దృష్టి
 భారత రాయభారి అరున్ కె సింగ్ తో కలసి ప్రత్యేక విందుకి హజరు
 పారిశ్రామిక వేత్తలతోపాటు ప్రవాస భారతీయులతో మమేకం కానున్న మంత్రి
 తెలంగాణ ప్రవాసుల కార్యక్రమాల్లో పాల్గోననున్న మంత్రి
 రెండువారాలపాటు అత్యంత బిజీ షెడ్యూల్లో మంత్రి పర్యటన
 తెలంగాణ రాష్ర్టానికి  మునుపెన్నడు లేనన్ని పెట్టుబడుల తరలింపు పైకన్ను
ఇప్పటికే జాతీయ స్ధాయిలో ఐటి మరియు పారిశ్రామిక రంగాల్లో తనదైన ముద్ర వేసుకుని, విజయవంతంగా తెలంగాణలో ఐటి పరిశ్రమను ముందుకు నడుపుతున్న తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అమెరికాలో పర్యటించనున్నారు. మే 5వతేది నుండి రెండు వారాలపాటు అమెరికా వ్యాప్తంగా పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగే ఈ పర్యటనలో అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలతో పాటు ప్రవాస భారతీయులను కలవనున్నారు. అక్కడ నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గోంటారు.
అమెరికాలోని వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, పిట్స్ బర్గ్, డల్లాస్, బే ఏరియా వంటి ప్రాంతాల్లోని నిర్ణీత సమావేశాల్లో పాల్గోననున్నారు. వీటితోపాటు న్యూజెర్సీ, డల్లాస్, బే ఏరియాలో తెలంగాణ ప్రవాసులు ఏర్పాటు చేసే పలు కార్యక్రమాల్లో పాల్గోంటారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రవాసుల భాగసామ్యం, పాత్రపైన వారితో చర్చిస్తారు.  తన పర్యటనలో భారత రాయభారి అరున్ కె. సింగ్ తోపాటు ఓక ప్రత్యేక విందులో కార్యక్రమంలోనూ పాల్గోంటారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో ఐటి మరియు ఇతర పారిశ్రామిక వర్గాల్లో తన చొరవతో ఉత్సాహం నింపిన మంత్రి, అమెరికా పర్యటనలో ప్రధానంగా తెలంగాణలోని పెట్టుబడులకున్న అవకాశాలను, ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రస్తావించనున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా  సెల్ప్ డిక్లరేషన్ తో అనుమతులు పొందే విధానం, నిర్ణీత గడువులోగా అనుమతులివ్వని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఇచ్చేలా రూపోందించిన పారిశ్రామిక విధానాన్ని అమెరికా పెట్టుబడిదారులకి వివరించనున్నారు.
మంత్రి కె.తారక రామారావు  పర్యటన బృందంలో  ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు పలువురు ఉన్నతాధికారులుంటారు.

No comments:

Post a Comment