హైదరాబాద్ నగరం పై విస్తారా ఏయిర్ లైన్స్ ఆసక్తి- పంచాయితీరాజ్ ఐటి శాఖమంత్రిని సచివాలయంలో కలిసిన విస్తారా ఏయిలైన్స్ ( టాటా) సియివో ఫీతెక్ వో
విస్తారా ఏయిలైన్స్ సేవలను హైదరాబాద్ కేంద్రంగా విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఏయిర్ పోర్టుల్లో 3వ రేటింగ్ సాధించిన హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ మౌళిక వసతులను పూర్తి ఉపయోగించుకునేందుకు విస్తారా సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకి పంచాయితీరాజ్ ఐటి శాఖమంత్రిని సచివాలయంలో కలిసిన విస్తారా ఏయిలైన్స్ ( టాటా) సియివో ఫీ తెక్ వో మర్యదా పూర్వకంగా కలిసారు. హైదరాబాద్లోని ఏవియేషన్ రంగంలోని అవకాశాలను విస్తారా సియివోకి మంత్రి వివరించారు. హైదరాబాద్ ఏయిర్పోర్ట్ సూమారుగా 20 శాతం ప్రయాణీకుల వృద్దిని సాధిస్తున్నదనని మంత్రి తెలిపారు. నూతనంగా తమ కార్యకలాపాలు ప్రారంభించిన విస్తారాకి ఇలాంటి పరిణామం కలిసి వస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే టాటా గ్రూప్ కి విశాలమైన ఉనికి ఉన్నదని, పలు టాటా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయని...ఇప్పుడు టాటాకే చెందిన విస్తారా ఏయిర్ లైన్స్ హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని కార్యాకలాపాలను ప్రారంభించాలని కోరారు. ఈ మేరకి త్వరలోనే టాటా గ్రూప్ చైర్మన్ టాటా మిస్ర్తీని కలిసి ప్రత్యేకంగా కోరతామన్నారు. తమ ముఖ్యమంత్రి ఇప్పటికే టాటాలాంటి కంపెనీలే తమ తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్స్ అని ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
హైదరారాబాద్ ఏయిర్ పొర్ట్ లో ఇప్పటకే అత్యుత్తమ మౌళిక వసతున్నాయని మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే అక్కడ విమానా ఇంజనీర్ల ట్రయినింగ్ సంస్ధ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలో విస్తారా ఏయిర్ లైన్స్ కి దక్షిణ భారత దేశంలో విస్తరించేందుకు వ్యూహాత్మకంగా భాగా కలసివస్తుందని మంత్రి తెలియజేశారు.
తాము ఇప్పటికే హైదరాబాద్ విమామానాశ్రాయంలో పర్యటించి అక్కడి మౌళిక వసతులు భాగున్నాయని...నూతనంగా సేవలు ప్రారంభించే ఏ కంపెనీకైనా హైదరాబాద్ లో అవకాశాలు కలిసి వస్తాయని విస్తారా సియివో ఫీతెక్ వో అన్నారు. తాము తమ విస్తారా ఏయిర్ లైన్స్ ద్వారా ప్రయానీకులకి అంతర్జాతీయ స్ధాయి సేవలను, అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని....తమ ప్రణాళికల్లో హైదరాబాద్ నగరాన్ని దృష్టిలో ఉంచుకుంటామని విస్తార సియివో ఫీతెక్ వో తెలిపారు.
సమావేశంలో పాల్గోన్న ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు గుజ్య్రోత్ సింగ్ మాల్హి , విస్తారా ఏయిలైన్స్ సలహదారు పాల్గోన్నారు.
Wednesday, 22 April 2015
MINISTER KTR PRESS MEET
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment