తెలంగాణ తాగునీటి పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి- పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు
• పథకం లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అధికారులకి అదేశం
• సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తే అంతర్జాతీయ అవార్డులు
• ప్రాజెక్టు మ్యాపులను , జిల్లా, మండల,గ్రామ పంచాయితీ కేంద్రాల్లో ఉంచాలి
• జిల్లాలోని ఏనిమిది శాఖలలో సమన్వయ కమీటీలు ఏర్పాటు చేసుకోవాలి
• ప్రతి వారం సమీక్ష కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వాని నివేధికలు పంపాలి
తెలంగాణ తాగునీటి పథకం పై పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు సమీక్షనిర్వహించారు. పథకం పనులు జరుగుతున్న తీరు మీద సమీక్ష నిర్వహించారు. త్వరలోనే ముఖ్యమంత్రి తెలంగాణ తాగునీటి ప్రాజెక్టు పై సమీక్ష సమావేశం నిర్వహిస్తరని. అలోగా పూర్తి స్ధాయి సమాచారం, జరిగిన పనుల నివేధికలతో సిధ్దంగా ఉండాలన్నారు. ప్రాజెక్టు జరుగుతున్న తీరుని, ప్రాజెక్టు లో భాగంగా చేప్పట్టిన వినూత్న పద్దతులను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ప్రాజెక్టు ప్రయోజనాలు, లక్ష్యాలను ప్రజలకి తెలియజేస్తే వారికి త్వరలోనే మంచినీరు అందుతుందన్న నమ్మకం ఉంటుదన్నారు . ప్రతి జిల్లా కేంద్రంలో అయా జిల్లాలో ఉండే ప్రాజెక్టు వివరాల సమగ్ర మ్యాపులు ఉంచాలన్నారు. జిల్లాలతో పాటు మండల కేంద్రంలోను, గ్రామ పంచయితీ కార్యలయాల్లోను వాటి పరిధిలోని ప్రాజెక్టు మ్యాపులను ఉంచాలన్న్నారు. దీనిపైన అవగాహన కల్పించేలా జిల్లాలోని రెవెన్యూ, సాగునీటి పారుదల, అటవి, అర్ అండ్ బి వంటి ఏనిమిది కీలక శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లా స్ధాయి అధికారులతో ఈ ఏనిమిది మందితో ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలని, వాటి మినట్స్ ని రాష్ర్ట ప్రభుత్వానికి పంపించాలని అదేశించారు.
ఇంటెక్ వెల్స్ నిర్మాణం పనులను సాద్యమైనంత త్వరగా పూర్తి చేయ్యాలని, వేసవి కాలంలో సాద్యమైనంగా ఏక్కువగా మేర నిర్వహించి, వర్షకాలం ప్రారంభంలోపల సేప్ స్టేజ్ కి చేర్చచాలని అదేశించారు. గతంలో అదేశించిన విధంగా ఈ ఈలు కార్యయాలయాల త్వరలోనే ప్రారంభించాలని, వారంలో అక్కడనుంచి వీడియో కాన్ఫరెన్స సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. వారం రోజుల్లోపల తాగునీటి ప్రాజెక్టు అధికారులంతా పూర్తి స్ధాయిలో క్షేత్రస్ధాయి నుంచి పనిచేయాలని, పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అర్ డబ్యూయస్ అధికారులు ప్రాజెక్టు కోసం చేస్తున్న పనికి దేశవ్యాప్తంగా మంచి ప్రశంశలు లభిస్తున్నాయని. పలువురు ఇతర రాష్ర్టాల అధికారులు, మంత్రులు తమను కలసి ప్రాజెక్టు పట్ల అసక్తి చూపిస్తున్నారన్నారు. ఇదే విధంగా ప్రాజెక్టు పూర్తి అయ్యేదాక పని చేయాలని కోరారు. ఇప్పటికే హడ్కోలాంటి ప్రతిష్టాత్మక సంస్ధ అవార్డు ఇచ్చిందని, మెత్తం రాష్ర్టానికి నల్లాద్వారా నీళ్లిచ్చే ఈ బృహత్ ప్రయత్నాన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తే అంతర్జాతీయ అవార్డుల సైతం వస్తాయన్నారు.
ఈ సమావేశంలో పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, అర్ డబ్యూయస్ ఈ ఏన్ సి సురేందర్ రెడ్డిలున్నారు.
No comments:
Post a Comment