తెలంగాణ వెబ్ న్యూస్;ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మోసం చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్ష,కార్యనిర్వాహక అధ్యక్షులు ఉత్తమ్ కూమార్ రెడ్డి,భట్టి విక్రమార్కులు విమర్శించారు.తెలంగాణ రాష్ట్రం నలుగురు వ్యక్తులతో నలిగిపోతోందని మండిపడ్డారు.ఆదివారం ఉదయం 11 గంటల వరకు జగ్జీవన్ రామ్ కు నివాళ్ళులర్పించకుండా అవమానించారని ధ్వజమెత్తారు.ఆదివారం టీపీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో గాందీభవన్ లో బాబూ జగ్జీవన్ రామ్ 108 వ జయంతి వేడుకలు జరిగాయి.దేశం గర్వించదగ్గ నేత జగ్జీవన్ రామ్ అని,హరిత విప్లవానికి,దళిత చైతన్యానికి ఆయన ఎంతో కృషి చేశారని నేతలు కొనియాడారు.
No comments:
Post a Comment