తేది-08-04-2015
పత్రికాప్రకటన
తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ యంఓవో....అతిపెద్ద అమెజాన్ పుల్ ఫిల్ సెంటర్ ప్రారంభం
• అమెజాన్ పెట్టుబడిని స్వాగతించిన ముఖ్యమంత్రి
• తెలంగాణని పెట్టుబడుల స్నేహపూర్వక రాష్ర్టంగా తీర్చితీద్దుతాని అమెజాన్ బృందానికి సందేశం పంపిన సియం
• ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటి శాఖ మంత్రి సమక్షంలో యంవోయు
• టియస్ ఐపాస్ ద్వారా కేవలం 11 రోజుల్లో అనుమతిచ్చమన్నా మంత్రి కె.తారక రామారావు
• పెట్టుబడులకి హైదరాబాద్ అకర్షనీయని మరోసారి రుజువైందన్నా మంత్రి
ప్రపంచ ప్రఖ్యతా అమెజాన్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో యవోఓ కుదుర్చుకుంది. దేశం మెత్తం మీద అమెజాన్ కంపెనీ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడని కంపెనీ తెలిపింది. ఈ యంవోయులో భాగంగా తెలంగాణలో అతిపెద్ద పుల్ ఫిల్ మెంట్ సెంటర్ని (fulfillment center) హైదరాబాద్ దగ్గల్లోని కొత్తూర్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కేంద్రం రెండు లక్షల ఏనభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ కేంద్రం ద్వారా వేలాది మం ది చిరు వ్యాపారులకి వ్యాపారావకాశాలు కల్పించడంతోపాటు, దేశవ్యాప్తంగా వారు తమ ఉత్పత్తులను అమెజాన్ .ఇన్ ద్వారా అమ్ముకునేందుకు వీలుకలుగుతుందని కంపెనీ తెలియజేసింది. వీటితోపాటు సెనిమానార్లు, వర్క్ షాపుల ద్వారా నూతనంగా ఈ కామర్స్ ద్వారా వస్తువులు అమ్ముకునేందుకు ముందుకు వచ్చే వ్యాపారులకి శిక్షణ ఇస్తామని తెలిపింది. ఈ కేంద్రం ద్వారా తెలంగాణలో వినియోగదారులకి వేగంగా తమ ఉత్పత్తులను చేరవేసేందుకు వీలుకలుగుతుంది.
తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమక్షంలో అమెజాన్ సీనియర్ ఉపాద్యక్షులు డేవ్ క్లార్క్, ఇండియా కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ లు తెలంగాణ ప్రభుత్వంతో యంవోయు కుదుర్చుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అమెజాన్ తెలంగాణ రాష్ర్టం పట్ల చూపిన నమ్మకాన్ని అభినందిస్తూ....తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకార మందిస్తూందని హమీ ఇచ్చారు. తెలంగాణ తీసుకువచ్చిన టియస్ ఐపాస్...ద్వారా ప్రాజెక్టుల కు మూడు వారాల్లో కేవలం సోంత దృవీకరణ ద్వార అనుమతులు ఇస్తున్నామని, అమెజాన్కి కేవలం 11వ రోజు అన్ని అనుమతులిచ్చినట్టు అమెజాన్ కంపెనీకి తెలియజేసిన సందేశంలో తెలిపారు. ఈ విధంగా తెలంగాణను పెట్టుబడుల స్నేహపూర్వక రాష్ర్టంగా మారుస్తున్నారు.
అమెజాన్ సీనియర్ ఉపాద్యక్షులు డేవ్ క్లార్క్ తెలంగాణ ఏప్పటినుంచో ఐటి పరిశ్రమకి చిరునామాగా ఉందని, కోత్త ప్రభుత్వం అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నదని, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహం వల్లనే అమెజాన్ ఇక్కడ భారీ పెట్టుబడితో ముందుకు వచ్చిందన్నారు. ఈ పుల్ పిల్ మెంట్ సెంటర్ ద్వార అమెజాన్ వినియోగ దారులకి వేగంగా సేవలందించడంతో పాటు వేలాది మంది చిరు, మద్య స్ధాయి వ్యాపారులకి ఉపయోగకరంగా ఉందని క్లార్క్ తెలిపారు.
భౌగోళికంగా అనువుగా ఉన్న హైదరాబాద్ నుంచి దేశ, విదేశాలకి ఉన్న రవాణా సౌకర్యాలు అమెజాన్ లాంటి కంపెనీలకి అధిక ప్రయోజనాన్ని కల్పిస్తాయని యంవోయు కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇందుకు అమెజాన్ లాంటి కంపెనీ అతిపెద్ద వేర్ హౌస్ నెలకోల్పడమే సాక్ష్యమన్నారు. ఈ పెట్టుబడి ద్వారా మద్యతరహ పరిశ్రమలకు అభివృద్ధి చెందుతాయని, స్దానిక వ్యాపారులకి జాతీయావకాశాలు దోరుకుతాయన్నారు. ఇలాంటి పెట్టుబడుతుతో ప్యాకేజింగ్, రవాణా, సరుకు రవాణతో పాటు ఆతిద్యరంగాలు లాభపడతాయన్నారు. అమెజాన్ లాంటి కంపెనీలు మరిన్ని తెలంగాణలో మరిన్ని పెట్టుబడుతు పెట్టాలని తాము కోరుతకుంటున్నాయని, కోత్తతరం వ్యాపారాల్లో సరికోత్త అవకాశాలకి కేంద్రంగా హైదరాబాద్ మారుతుందని, దానికి అమెజాన్ పెట్టుబడి మంచి ప్రారంభమని తారక రామారావు తెలిపారు.
అమిత్ అగర్వాల్ అమెజాన్ ఇండియా మేనేజర్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ర్టంతో రాబోయే కాలంలో మరింత భాగసామ్యాన్ని పెంచుకుంటామని, తమ కంపెనీ ద్వారా వ్యాపారులకి, వినియోగదారులకి సేవలందిస్తామన్నారు. అమెజాన్ ద్వారా తాము అందిస్తున్న 2.1 కోట్ల విసృత శ్రేణి తెలంగాణ పౌరులు వినయోగించుకోవాలని కోరారు.
Wednesday, 8 April 2015
Amazon investment in hyderabad
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment