All meadia

 

Thursday, 9 April 2015

Free wifi at hussain sagar shortly

తేది-09-04-2015

పత్రికా ప్రకటన

హైదరాబాద్ లో  ఉచిత వైపై  ఏర్పాట్లపై ఐటిశాఖ మంత్రి కె.తారకరామారావు సమీక్ష

హైదరాబాద్ లో  ఉచిత వైపై సేవలను దశల వారీగా ప్రారంభించేదుకు ప్రభుత్వం సిద్దమౌతున్నది. గురువారం సచివాలయంలో ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు కార్యాలయంలో, త్వరలో  హుస్సేన్ సాగర్ చుట్టు ప్రయోగాత్మకంగా, పైలట్ ప్రాజెక్టు ప్రాతిపాతికన ప్రారంభించబోతున్న ఉచిత వైఫై సేవల కార్యాక్రమంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బియస్ యన్ ఏల్ తోకలిసి క్వాడ్ జెన్ కంపెనీ ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించబోతున్నది. బియస్ యన్ ఏల్ ఉన్నాతాధికారులు, క్వాడ్ జెన్ కంపెనీ ప్రతినిధులు మంత్రి కె.తారక రామారావుకి ప్రాజెక్టు పనిచేసే విధానాన్ని, జరుగుతున్న తుది ఏర్పాట్లను వివరించారు. హుస్సెన్ సాగర్ పరిసారాల్లోనే ట్యాంకుబండ్ , లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్డులో సుమారు 1800 నుంచి 2500 మంది పౌరులు ఈ సేవలను ఓకేసారి లాగిన్ కావచ్చని ప్రతినిధులు మంత్రికి విరించారు. త్వరలోనే హుస్సేన్ సాగర్ చుట్టు సూమారు 10 కీలోమీటర్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఉచితంగా 30 నిముషాలపాటు పైఫై సేవలు పొందవచ్చు... సరాసరి 2 యంబిపియస్ నుంచి 20 యంబిపియస్ వరకి వేగంతో ఉచిత వైపై పనిచేస్తుంది. ఇప్పటికే భద్రతాపరమైన పరీక్షలను పూర్తిసుకుని, కేంద్ర మరియు రాష్ర్ట శాంతిబధ్రతల ఏజెన్సీల నుంచి అనుమతులు తీసుకున్నట్లు ప్రతినిధులు తెలియజేశారు.

           పౌరులకి నాణ్యమైన సేవలను అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి బియస్ యన్ఏల్ అధికారులను కోరారు. అయితే సాద్యమైనంత త్వరగా హైదరాబాద్లోని ఓక జోన్ లో పూర్తి వైపై సేలను పూర్తి స్ధాయిలో అందించేందుకు పనులు ప్రారభించాలని బియస్ యన్ ఏల్ ని మంత్రి కోరారు. తమకు నగరంలో ఉన్న 4800 కీలోమీటర్ల పైబర్ నెట్ వర్క్ ద్వారా హైదరాబాద్లోని నలు మూలల వైపై సేవలను అందించేందుకు వీలౌవుతుందని అధికారులు మంత్రికి తెలిపయజేశారు. వియోగాదారులకి నాణ్యమైన సేవలు అందిస్తే ఈ హైదరాబాద్ వైపై కార్యక్రమం విజయవంతంమౌతుందని మంత్రి కె.తారక రామా రావు అన్నారు.   

ఈ సమీక్ష సమావేశంలో ఐటి శాఖ సెక్రటరీ హర్ ప్రీత్ సింగ్ తోపాటు బియస్ యన్ ఏల్  మరియు క్వాడ్ జెన్ ఉన్నాతాధికారులు పాల్గోన్నారు.

మంత్రిని కలిసిన ఓరాకిల్ ప్రతినిధులు

ఐటిశాఖ మంత్రి కె.తారకరామా రావుని ఓరాకిల్ ప్రతినిధిబృందం కలిసింది.  ఓరాకిల్ జనరల్ మేనేజర్ అండ్ సినియర్ ఉపాధ్యక్షులు Mr. Chris Cheadle, ఓరాకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్  Mr. Shailender Kumar Yatin లతో పాటు కంపెనీ సినయర్ ప్రితినిధులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసారు. హైదరాబాద్లో ఐటి పరిశ్రమ అభివృద్ది జరుగుతున్న తీరుని మంత్రి వారికి విరించారు. ఓరాకిల్  కంపెనీ మరోసారి తమ భవిష్యత్ ప్రణాళికలతో త్వరలోనే కలుస్తామనిరు

No comments:

Post a Comment