All meadia

 

Wednesday, 8 April 2015

అశ్రునయనాల మధ్య ఎస్ ఐ సిద్దయ్య అంత్యక్రియలు పూర్తి

తెలంగాణ వెబ్ న్యూస్;అశ్రునయనాల మధ్య ఎస్ ఐ సిద్ధయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి.జడ్చర్ల పాతబజార్ శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో సిద్ధయ్య మృతదేహన్ని ఖననం చేశారు.సిద్ధయ్య అంతిమయాత్రలో పాల్గొనడానికి వచ్చిన వారితో జడ్చర్ల వీధులు జనసంద్రాలయ్యాయి.ముష్కరుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఎస్ ఐ సిద్ధయ్య అంతిమయాత్ర మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ఆయన నివాసం నుంచి ఉదయం పదకొండున్నర ప్రాంతంలో ప్రారంభమైంది.అంతకు ముందు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ,తెలంగాణ ముంత్రులు లక్ష్మారెడ్డి,జూపల్లి కృష్ణారావు,కాంగ్రెస్ నేతలు జానారెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,చిన్నారెడ్డి తదితరులు సిద్ధయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్ళలర్పించారు.

No comments:

Post a Comment