తెలంగాణని ఐటి అగ్రగామిగా నిలిపేందుకు పనిచేయాలి-ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు;
* tsipard(అపార్ఢ్) లో విస్తృత స్థాయి ఐటి శాఖ అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి
* జూన్ రెండు నుంచి ఐటిశాఖ పనితీరు చేపట్టిన కార్యక్రమాలపై చర్చ
* ప్రతి ఒక్క అధికారి లక్ష్యాలు నిర్ధేశించుకోవాలని అదేశం
* రాబోయే నాలుగేళ్ళ కాలానికి పలు లక్ష్యాలు నిర్ధేశించిన మంత్రి
* ప్రస్తుత సాప్ట్ వేర్ ఏగుమతుల రెట్టింపే లక్ష్యం
* ప్రతి ఇంటికి ఒక్క కంప్యూటర్ అక్షరాస్యున్ని తయారు చేయాలి
* కొత్త పరిశ్రమలతో పాటు ఉన్న పరిశ్రమలకి సౌకర్యాల దృష్టి
* ఐటి శాఖ చేపట్టిన కార్యక్రమాలు,భవిష్యత్ ప్రణాళికమైన కూలంకషంగా చర్చించిన మంత్రి
తెలంగాణని ఐటి అగ్రగామిగా నిలిపేందుకు,ప్రభుత్వ శాఖలకి,ప్రజలకి అవసరమైన సేవలను అందించేలా పనిచేయాలని ఐటి శాఖాదికారులను ఐటి శాఖ మంత్రికె.తారక రామారావు కోరారు.తెలంగాణలోని వ్యాపార అవకాశాలను తెలియజేసేలా విస్తృతమైన ప్రచారం చేయాలని సూచించారు.గత పది నెలల్లో ఐటి పరిశ్రమల వర్గాలతో మాట్లాడి,వారిలో విశ్వాసం కల్పించడంలో విజయవంతమయ్యామని మంత్రి కె.తారక రామారావు అన్నారు.ఇప్పటికే హైదరాబాద్ టెక్నాలజీ లీడర్ గా ఉందని అయితే ప్రస్తుతమున్న 57 వేల కోట్లున్న సాఫ్ట్ వేర్ ఏగుమతులను రాబోయే 5 ఏళ్లలో రెట్టింపు చేయడమేలక్ష్యంగా పనిచేయాలని ఐటి శాఖాధికారులకి సూచించారు.నూతన పరిశ్రమలు,పట్టుబడులతో పాటు హైదరాబాద్ లో ఉన్న ఐటి పరిశ్రమలు విస్తరించేలా సౌకర్యాలు కల్పించాలని....ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులకి భాద్యతలప్పగించాలన్నారు.సాఫ్ట వేర్ రంగంతో పాటు రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్ రంగం పై మరింత శ్రద్ద వహించాలని కోరారు.వీటితో పాటు హర్ఢ్ వేర్ రంగంలో అనేక అవకాశాలున్నాయని,కేంద్రమిచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం నేపథ్యంలో తెలంగాణను హర్డ్ వేర్,ఏలక్ర్టానిక్ పరిశ్రమలకి కేంద్రంగా మార్చేలా చూడాలని శాఖాదికారులను కోరారు.ఐటి శాఖ తరపున పరిశోధన మరియు ఇంట్రపెన్యూర్ అవకాశాలను పెంచేలా..వారికి సహకరించేలా...జౌత్సహిక పరిశోధనల కోసం టిహబ్ ని ప్రారంభించబోతున్నమన్నారు.వీటితో పాటు విద్యార్ధులకి,నిరుద్యోగులకి అవకాశాలు కల్పించేలా టాస్క్(telangana academy of knowledge and skill),జెయన్టీయు మరియు నాస్కామ్ లమధ్య యంవోఓ కుదుర్చుకున్నామని,అయితే టాస్క్ ఖచ్చితమైన లక్ష్యాలతో పనిచేయాలన్నారు.యన్డీయల్ యం(NDLM-national digital literacy mission),యన్ యస్ డిసి(NSDC)వంటి కేంద్ర పథకాలను దృష్టిలో పెట్టుకుని టాస్క్ పని చేయాలన్నారు.రాబోయే ఐదేళ్లలోప్రతి ఇంట్లో ఒకరిని డిజిటల్ అక్ష్యరాస్యులను చేయడం...లక్ష్యంగా ఉండాన్నారు.దీంతో పాటు ఐయస్ బి(ISB)తో కలిసి టెక్నాలజీ ఏంట్రపెన్యూర్ ప్రోగ్రామ్ (TEP)నిర్వహిస్తున్నామన్నారు.తెలంగాణ ఈ గవర్నెన్స్ కార్యక్రమాల్లో ముందున్నదని,ఇక మీద యం-గవర్నెన్స్(M-governance) వైపు సరికోత్త కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
ఐటి శాఖ ప్రభావం ప్రతి శాఖ మీద ఉంటుందని,కేవలం తన శాఖ వరకే పరిమితం కాకుండా...ప్రభుత్వం మరియు ప్రజలకి అవసరమైన కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రయత్నించాలని కోరారు.ఈ- పంచాయతీల ఏర్పాటులో ఐటి శాఖ,పంచాయతీ రాజ్ శాఖతో సమన్వయం చేసుకోవాలని...ఈ పంచాయితీలతో రాబోయే రోజుల్లో గ్రామాల్లో గుణాత్మక మార్పులు రాబోతున్నాయని,ఈ-పంచాయితీలతో గ్రామాల్లో పౌరసేవలేకాకుండా ఫ్తెనాన్సింగ్,బ్యాకింగ్,ఇన్యూరెన్స్ సేవలను అదించనున్నట్లు తెలిపారు.రాబోయే ఐదేళ్లలో తెలంగాణను డిజిటల్ తెలంగాణ గా మార్చడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉచిత వైపై సౌకర్యాన్ని దశలవారీగా విస్తరిస్తున్నట్లు తెలిపారు.
ఐటి శాఖ చేపట్టిన పలు కార్యక్రమాలపై అందరితో కలసి చర్చ నిర్వహించిన మంత్రి ,తెలంగాణని ఐటి రంగంలో ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలో ప్రతి ఒక్కరు లక్ష్యలు నిర్ధేశించుకుని పనిచేయ్యాలని సూచించారు.తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రమీణాభివృద్ది సంస్థ రాజేంద్ర నగర్లో నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష సమావేశంలో ఐటి శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ తో పాటు ఐటి శాఖ లో పనిచేస్తున్న వివిధ విభాగాలు,కార్పొరేషన్ల అధికారుల పాల్గోన్నారు.
No comments:
Post a Comment