తెలంగాణ వెబ్ న్యూస్;ఎర్రచందనం దొంగలపై కటినచర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు పోలీసులను,ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించిందన్న వాదన వినిపిస్తోంది.తమిళనాడు నుంచి ఎర్రచదనం స్మగ్లర్లు పెద్దసంఖ్యలో అమాయకులను కూలీలుగా తీసుకురావడం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడుకు లేఖ కూడా రాసింది.స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లు నరకడానికి తమిళనాడు నుంచి కూలీలను.తీసుకొస్తున్నారని,వారిని అడ్డుకోవాలని ఆ లేఖలో కోరినట్లు సమాచారం.ఎర్రచందనం చెట్లు నరుకుతూ,తరలిస్తూ దొరికితే జైళ్లలో పెడతామని,రూ.50 వేల వరకూ జరిమానా విధిస్తామని ..పోలీసులపై తిరగబడి,దాడులకు ప్రయత్నిస్తే కాల్పులు జరుపుతామని..ఇది వారి ప్రాణాలకు ప్రమాదమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు ను హెచ్చరించింది.
No comments:
Post a Comment