తెలంగాణ వెబ్ న్యూస్;నల్గొండ జిల్లా జానకీపురం ఎన్ కౌంటర్ లో మృతి చెందిన నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ హోమంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి తెలిపారు.శనివారం కామినేని ఆస్పత్రిలో ఉన్న నాగరాజు మృతదేహాన్ని నాయిని సంతాపం తెలిపారు.అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శించారు.కాల్పులో మృతి చెందిన నాగరాజు కుటుంబానికి రూ.40 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు ఆయన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు చెప్పారు.
No comments:
Post a Comment