తెలంగాణ వెబ్ న్యూస్;తెదేపా నేత, మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి భౌతికకాయాన్ని గురువారం ఉదయం పలువురు సందర్శించి నివాళులర్పించారు తెదేపా కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్,ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి,భాజపా నేత కావూరి సాంబశివరావు,తదితరులు చౌదరి భౌతికకాయానికి నివాళులర్పించి శ్రద్దాంజలి ఘటించారు.ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ..జిల్లా అభివృద్దితో పాటు తాగు,సాగునీటి సమస్యల పరిష్కారానికి రాంభూపాల్ చౌదరి ఎంతో కృషిచేశారని కొనియాడారు.సీఎం ఆదేశాల మేరకు రాంభూపాల్ చౌదరి అత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment