తెలంగాణ వెబ్ న్యూస్;ఆహార భద్రత పేదవాడి హక్కు అని కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గణపతిరాజు అన్నారు.విజయనగరంలో జాతీయ ఆమారభద్రతా పథకాన్ని ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.పేదవారికి ఆహారభద్రత దివంగత ఎన్టీఆర్ కల అని అంటూ కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంసంతోషకరమన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఈ పాస్ విధానం వల్ల దుర్వినియోగానికి చెక్ పడుతుందని చెప్పారు.మంత్రి మృణాళిని మాట్లాడుతూ,కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ పాస్ విధానం ప్రవేశపెట్టగా,ఒక నెలలోనే 35 నుంచి 40 శాతం వరకూ దుర్వినియోగాన్ని అరికట్టామని,ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాలో ఈ విధానాన్ని పర్వేశపెట్టినట్టు చెప్పారురేషన్ డీలర్లకు కమీషన్ ను భారీగా పెంచినందున వారు మరింత బాధ్యతగా సేవలందించాలన్నారు.
No comments:
Post a Comment