తెలంగాణ వెబ్ న్యూస్;ప్రధాని నరేంద్ర మోదీ,తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయనీ,ఇద్దరూ తమతమ మాటలతోనే కోటలు కడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ విమర్శించారు.నిరంకుశ అధికారాన్ని చెలాయించడంలో ఇద్దరూ ఒకరికి ఒకరు సరిపోతారని చెప్పారు.ఆదివారం ఆయన హైదరాబాద్ లో పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దిల్లీలో మోదీ,హైదరాబాద్ లో కేసీఆర్ గొప్పగొప్ప మాటలు చెబుతున్నారు.మాటలతో కోటలు కట్టడమనే లక్షణం కలుపుతోంది. నిరంకుశత్వం కూడా ఇద్దరినీ ఏకం చేస్తోంది.కేసీఆర్ మాదిరిగానే మోదీదీ నిరంకుశం.తెలంగాణలో భిన్నాభిప్రాయం వెలిబుచ్చేవారిని అణిచేస్తున్న రీతిలోనే మోదీ కూడా చేస్తున్నారు.గొప్పలు చెప్పుకోవడం,తప్పుడు వాగ్దానాలు చేయడంలో ఇద్దరూ ఇద్దరే అని విమర్శించారు.
No comments:
Post a Comment