All meadia

 

Friday, 19 September 2014

గోదావరి త్రాగునీటి ప్రాజెక్టుపై ప్రెస్ మీట్

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో త్రాగునీటి అవసరాలను తీర్చడానికి 2008 లో త్రాగునీటి పథకం మొదలు పెట్టందని, అది ఆచరణలో  తగిన వనరులు లేక  తీవ్ర ఇబ్బందులకు గురైందని గుడ్ గవర్నెన్స్ సెక్రెటరీ ఎం.పద్మనాభ రెడ్డి తెలిపారు. లకిడికపూల్ లో జివికె మెన్షన్ లో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా  పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వివరాలను మీడియాకు చూపిస్తూ  జి.వో 679 తేది 26.9.2008 ద్వారా ఉపనది అయిన  ప్రాణ హిత నుంచి 30 టిఎంసిల  నీటిని హైదరాబాద్ కు తరలించాలని, అందులో మొదటి దశలో  రూ.3375 కోట్లతో  30 నెలలలో 10 టియంసిల  నీరు ( మార్చి 2011) నాటికి చేరాలని నిర్దేశించారని తెలిపారు. అది ఇప్పటికి పూర్తి వనరులు సరిగా లేక సమస్య కుంటుపడిపోయిందన్నారు.  
ఈ ప్రాజెక్టుకు  ఖర్చు....
ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో హైదరాబాద్ నగర పాలక సంస్థ 506 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 1181 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 1688 కోట్లు కోట్లు ఇవ్వాలన్నారు. నగర పాలక సంస్థ, కేంధ్రం ఎటువంటి నిధులు ఇవ్వక పోవడంతో మొత్తం భారం ప్రభుత్వంపై పడిందని తెలిపారు. ప్రభుత్వం కూడా సంవత్సరానికి 200 నుంచి 300 కోట్లు మాత్రమే  నిధులు మంజూరు చేయడంతో పనులు ముందుకు సాగలేదన్నారు. చేసేది ఏమి లేక హడ్కో సంస్థ నుంచి 12 శాతం వడ్డీతో 2000 కోట్లు అప్పుగా తీసుకున్నామన్నారు. అందులో 1000 వెయ్యి కోట్ల రుణం తీసుకొని పనులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. 2013, 2014 నాటికి ఈ ప్రాజెక్టుపై 2039 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.  2008 లో 3375 కోట్ల ఎస్టిమేటు, ధరలు పెరగడంతో అది కాస్త రెండింతలయ్యిందన్నారు. హడ్కొకు ప్రతి నెల 20 కోట్లు వడ్డీ కట్టే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తగినన్ని  నిధులు విడుదల చేసి 2016 నాటికైనా ఈ ప్రాజెక్టు  పూర్తయ్యేటట్లు చూడాలన్నారు. 

No comments:

Post a Comment