All meadia

 

Sunday, 7 September 2014

ర‌హ్మ‌త్‌న‌గ‌ర్ చౌర‌స్తాలో ఘనంగా గ‌ణ‌ప‌తి ఉత్స‌వాలు



ర‌హ్మ‌త్‌న‌గ‌ర్ చౌర‌స్తా గ‌ణేష్ మండ‌పంలో మాజీ ఎమ్మెల్యే విష్ణును స‌న్మానిస్తున్న కార్పొరేట‌ర్ చంద్ర‌మ్మ‌, భ‌వానీశంక‌ర్‌
తెలంగాణ వెబ్‌న్యూస్‌, హైద‌రాబాద్ :  ర‌హ్మ‌త్‌న‌గ‌ర్ చౌర‌స్తాలో వినాయ‌క న‌వ‌రాత్రి  ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఆదివారం స్థానికి గ‌ణేస్ ఉత్స‌వ క‌మిటి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి, కార్పొరేట‌ర్ బండ‌ప‌ల్లి చంద్ర‌మ్మ‌ ముఖ్య అతిథిగా హాజ‌రై  ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం జ‌రిగిన అన్న‌దాన కార్య‌క్ర‌మంలో భ‌క్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాం గ్రెస్ నాయ‌కుడు భ‌వానీశంక‌ర్ ఎమ్మెల్యే విష్ణును శాలువాతో స‌న్మానించారు. కార్య‌ క్ర‌మంలో నాయ‌కులు బాబూఖాన్‌, ఎల్‌కె. ర‌మేష్‌, న‌ట‌రాజ్‌యాద‌వ్‌, రాజేంద‌ర్‌గుప్త‌, క్రిష్ణ‌మూర్తి, సురేష్‌యాద‌వ్‌, ఎం. ర‌వింద‌ర్‌రెడ్డి, మునిస్వామి, కుమార్‌, సురేంద‌ర్‌, శ్ర‌వ‌ణ్‌, రాహుల్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.  
మధు వెబ్ న్యూస్ రిపోర్టర్.... 
rcnjournalism@gmail.com
9392641999

No comments:

Post a Comment