శాలువాతో సన్మానిస్గున్న సాయిగిరి
తెలంగాణ వెబ్‌న్యూస్, హైదరాబాద్ : యూసుఫ్‌గూడ డివిజన్ ఎల్ఎన్‌నగర్‌లోని శ్రీసాయిగిరి హైస్కూల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ప్రముఖ సనీ దర్శకులు బోయపాటి శ్రీను, స్థానిక కార్పొరేటర్ జి. మురళీగౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో గణేష్ లడ్డూను వేలం వేశారు. స్థానిక సంఘసేవకుడు బి. ప్రకాష్‌ముదిరాజ్ రూ. 2550లకు గణపతి లడ్డూను దక్కించుకున్నాడు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిగిరి హైస్కూల్ కరస్పాండెంట్ కె. సాయిగిరి మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఐక్యమత్యాన్ని చాటుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను, కార్పొరేటర్ మురళీగౌడ్, ఎంఐఎం జూబ్లీహిల్స్ నేత నవీన్‌యాదవ్, సినీ ఆర్టిస్టు దాసన్న లను సాయిగిరి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.
మధు వెబ్ న్యూస్ రిపోర్టర్....
rcnjournalism@gmail.com
9392641999

No comments:
Post a Comment