తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్.. పునర్వభజనలో పేర్కొన్న అంశాలు అమలయ్యేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ కేంధ్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో కేసీఆర్ కలిశారు. 9, 10 షెడ్యూళ్లల్లో పేర్కొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కార్పోరేషన్లు, విశ్వవిద్యాలయాల వంటి ప్రభుత్వ రంగ సంస్థల పంపకాల విషయంలో స్పష్టత కావాలని కోరారు. ఈ సమావేశానికి పలువురు టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులు ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.
ఢిల్లీలో కేంధ్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి పుష్పగుచ్చం ఇస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్....
ఢిల్లీలో ఆదివారం కేంధ్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ఎంపిలు కేశవరావు, వినోద్ తదితరులు....
కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి స్మృతి ఇరానీకి పుష్పగుచ్చం ఇస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...



No comments:
Post a Comment