గ్రేటర్ ఎన్నికలే లక్ష్యం...
అక్టోబర్ 2 గాంధీ జయంతి, విజయదశమి మూహూర్థం... నిర్ణయం... .
అప్పటి వరకు తెలిసే అవకాశం...
టీఆర్ఎస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్...
అక్టోబర్ 2 గాంధీ జయంతి, విజయదశమి మూహూర్థం... నిర్ణయం... .
అప్పటి వరకు తెలిసే అవకాశం...
టీఆర్ఎస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్...
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (ఫైల్ ఫోటో)
తెలంగాణ, వెబ్ న్యూస్; హైదరాబాద్; ప్రచారం అయితే జరుగుతుంది కానీ... టీడీపా, టీఆర్ఎసా అనేది తేల్చుకోలేకపోతున్నారు... గత కొంతకాలంగా తలసాని టీడీపీని వీడుతారనే ప్రచారం అందరికి తెలిసిన విషయమే పలు చానెళ్లలో కూడా ప్రసారాలు వచ్చాయి. గ్రేటర్ ఎన్నికలు దష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లోకి చేరేందుకు సిద్దమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ ను విడిచి టీఆర్ఎస్ కారు ఎక్కబోతున్నారా... అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రచారాలు మాత్రం జోరందుకున్నాయి. కానీ చాలా మందిలో టీఆర్ఎస్ లోకీ చేరే అవకాశం ఉందని కొందరూ... టీడీపీని విడుస్తారా... అని మరికొందరిలో అలఝడి రేగుతోంది... తలసాని టీఆర్ఎస్ లోకి చేరే అవకాశం 90 శాతం ఉందన్న చర్చ కొనసాగుతుంది. తలసానితో పాటు కార్పొరేటర్లు, నాయకులు చేరే అవకాశం ఉంది. ఇది వరకే టీఆర్ఎస్ లో చర్చలు వినిపిస్తున్నాయి. కొంత మంది కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఖైరతాబాద్ కు చెందిన వైసీపీలో నుంచి పీజేఆర్ కూతురు విజయారెడ్డి టీఆర్ఎస్ లోకి ఇదివరకే చేరారు. అటు సోషల్ నెట్ వర్కింగ్ తో ప్రచారాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కూడా తలసానితో పాటు చేరే అవకాశం ఉంది... తలసానితో పాటు దసర పండగ చివరిలోగా టీఆర్ఎస్ లోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తలసానితో ఖైరతాబాద్ దానం నాగేందర్ (ఖైరతాబాద్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి), వివేక్ గౌడ్ (కుత్భల్లాపూర్ టీడీపీ), తీగల కృష్ణారెడ్డి
MLA, మంచి రెడ్డి కిషన్ రెడ్డి( ఇబ్రహింపట్నం టీడీపీ ఎమ్మెల్యే), మోత్కుపల్లి( టీడీపీ నాయకులు)వారి వారి అనుచరులు టీఆర్ఎస్ తో చేరుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి త్వరలో అక్టోబర్ 2న మూర్తం సిద్దమైనట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి వలసలు ఇది వరకే చాలా మంది నాయకులు, కార్పొరేటర్లు చేరే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రేటర్ పీఠమే లక్ష్యంగా చేసుకున్నట్లు పలు రాజకీయ సీనియర్ నాయకులు వారి అభిప్రాయాలు చెబుతున్నారు. త్వరలో వచ్చే గ్రేటర్ పరిధిలో కార్పొరేట్ ఎన్నికలు దృష్టలో పెట్టుకొని టీఆర్ఎస్ లోకి వలసల బాట పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతన్నారు.

No comments:
Post a Comment