All meadia

 

Tuesday, 23 September 2014

ఇండస్ట్రీలో పని చేసే కార్మికులకు న్యాయం చేస్తా; నాయిని

పని చేసే కార్మికులు జీతాలు సరిపోవడం లేదు...
కాలం గడిచినా పర్మినెంట్ చేయడం లేదు; సధా నంద్ గౌడ్
  హెచ్ ఎంఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయిని నర్సింహ రెడ్డిని సన్మానిస్తున్న సధా నంద్ గౌడ్ తదితరులు... 
 తెలంగాణ, వెబ్ న్యూస్; హైదరాబాద్;  హైదరాబాద్  ఇండస్ట్రిస్  సనత్ నగర్ లో పని చేసే  కార్మికులకు న్యాయం చేసే విధంగా  పోరాటం చేస్తానని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. మంగళవారం సుందర్ నగర్ కాలనీలో హెచ్ ఎంఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయిని నర్సింహ రెడ్డిని సన్మానించారు. ఈ సన్మాన సభలో నాయిని మాట్లాడుతూ సనత్ నగర్  ఆ ఇండస్ట్రీలో పని చేసేవారికి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పారు. ఈ సందర్బంగా హెచ్ఎంఎస్ పార్టీ సనత్ నగర్ అభ్యర్థి సదానంద్ గౌడ్ మాట్లాడుతూ సంస్థలో పని చేసేవారికి ట్రైనింగ్ లో 3 వేల నుంచి ఇస్తున్నప్పటి నుంచి పని చేస్తున్నామన్నారు. ట్రైనింగ్ మూడు సంవత్సరాల తరువాత 15 వేల వరకు ఇస్తామని హామీ కూడా ఇచ్చారన్నారు. అది వారు నిలబెట్టుకోలేకపోయారన్నారు.  ప్రత్యర్థి అయిన సంజీవరెడ్డి  ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు.  గత రెండు సంవత్సరాల నుంచి నోటీసులు ఇవ్వకుండా ఎలక్షన్లు పెడతామని వారే నిర్ణయం తీసుకున్నారన్నారు. మీరు గెలిచిన తరువాత మీకు ఏమి అడిగినా కాదనకుండా పని చేసి పెడతానని నాయిని హామీ ఇచ్చారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో విఠల్, సందీప్, కన్నాలాల్ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని ఫోటోలు..

No comments:

Post a Comment