బతుకమ్మలను నీటిలో వదులుతున్న మహిళలు...
గ్రేటర్ పరిధిలో బతుకమ్మ ఉత్సవాలు...
ఎక్కడ చూసిన బతుకమ్మ పేరే మారుమోగుతుంది...
తెలంగాణ వెబ్ న్యూస్; హైదరాబాద్; గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బతుకమ్మ పండుగను ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. రంగురంగుల పువ్వులు, ముచ్చటైన తెలంగాణ బతుకమ్మ పాటలు వింటేనే మనస్సు పరవశించిపోతుంది... అది మన తెలంగాణ ప్రత్యేకం అని చెప్పుకోవాలి... బతుకమ్మ పాటలు తొమ్మిది రోజుల పాటు మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఎక్కడెక్కడో ఉన్న ఆడపడచులందరూ ఈ పండక్కి ఇళ్లు చేరుకోవడం ఒక సంప్రదాయం... మంగళహారతులతో తొమ్మిదో రోజు గౌరమ్మను చేసి చెరువుల్లో వదలడం ఆనవాయితీగా వస్తోంది... తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రం ప్రత్యేకంగా కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్, అమీర్ పేట, దుండిగల్, కెపిహెచ్ పి కాలనీ, బాలనగర్, జీడిమెట్ల, హైదర్ నగర్, పేట్ బషీరాబాగ్, జేఎన్ టీయూ, షాపూర్ ప్రాంతాల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ పండుగల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మరిన్ని ఫోటోలు;









