All meadia

 

Friday, 5 September 2014

ప‌దేళ్ల సుధీర్ఘ ప్ర‌యాణంలో తెలంగాణ సాధించాం...ఇక మిగిలింది పున‌ర్నిర్మాణం : ప‌్రొఫెస‌ర్ కోదండ‌రాం

 బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక స‌భ‌లో ప్ర‌సంగిస్తున్న ప్రొ.                                                                      కోదండ‌రామ్‌ 
అధ్య‌క్షోప‌న్యాసం చేస్తున్న వేదిక రాష్ర్ట కార్య‌ద‌ర్శి తిప్ప‌ర్తి యాద‌య్య‌

తెలంగాణ వెబ్ న్యూస్‌, హైద‌రాబాద్ : ఒక చిన్న ప్ర‌య‌త్నం పెద్ద ల‌క్ష్యాన్ని సాధించాం..ల‌క్ష్యం పెద్ద‌దైనా వెనుక‌డుగు వేయ‌కుండా సుధీర్ఘ ప్ర‌యాణం చేసి తెలంగాణ ప్ర‌త్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నాం.. అయితే రాష్ర్ట సాధ‌న‌తో మ‌న పోరాటం ఆగిపోలేద‌ని అస‌లైన పోరాటం మిగిలే ఉంద‌ని తెలంగాణ విద్యావంతుల వేదిక గౌర‌వాధ్య‌క్షులు, టీజేఏసీ చైర్మ‌న్‌ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ ప్ర‌జ‌ల‌కు దిశా నిర్ధేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వేదిక ప్రారంభం నుంచి నేటి వ‌ర‌కు జ‌రిగిన వేదిక కార్యాచ‌ర‌ణ‌ల‌ను వివ‌రించారు. గ‌త 60 ఏళ్బ విధ్వంసాన్నిపున‌ర్నిర్మిచుకోడానికి అలుపెరుగ‌ని పోరాటం చేయాల్సి ఉంద‌ని అన్నారు. ఈ విధ్వంసం ప‌ది జిల్లాల‌ను తిరిగి చూడ‌న‌వ‌స‌రం లేద‌ని కేవ‌లం హైద‌రాబాద్ న‌గ‌రం చుట్టూ జ‌రిగిన సీమాంధ్రుల దురాక్ర‌మ‌ణ‌ల‌ను చూస్తే స‌రిపోతుంద‌ని అన్నారు. ల‌క్ష‌లాది ఎక‌రాల ప్ర‌భుత్వ భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను చూస్తే గుండె ద్ర‌వించుకుపోతుంద‌ని ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు. ప‌రిమితుల‌ను అధిగ‌మించి వేదిక‌ను బ‌లోపేతం చేద్దామ‌ని, ఇంత‌దాక ప‌య‌నించాం ఇక ముందుకు పోవ‌డం పెద్ద ప‌నికాద‌ని, త‌ప‌న ప‌డి, ఆరాట‌ప‌డుతూ పున‌ర్నిర్మాణాన్ని సాధించి జ‌యశంక‌ర్‌సార్ ఆశ‌యాన్ని నెర‌వేర్చుదామ‌ని పిలుపునిచ్చారు. మంచిర్యాల‌లో జ‌రిగే ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లిరావాల‌ని కోదండ‌రామ్ పిలుపునిచ్చారు. బ‌షీర్‌బాగ్‌లోని దేశోద్దార‌క భ‌వ‌న్ ప్రెస్‌క్ల‌బ్‌లో గురువారం సాయంత్రం జ‌రిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక ద‌శాబ్ది ఉత్స‌వాల స‌న్నాహ‌క స‌భ‌కు ఆయ‌న ప‌రిశీల‌కులుగా విచ్చేసి ప్ర‌సంగించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ప‌దేళ్లు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంగా ఈ నెల 14న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల‌లో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను విజ‌యవంతం చేయ‌డానికి వేదిక న‌గ‌ర క‌మిటి ఆధ్వ‌ర్యంలో స‌న్నాహ‌క స‌భ‌ను నిర్వ‌హించింది. ఈ స‌భ‌కు వేదిక న‌గ‌ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌. విశ్వ‌నాథ్ ఆహ్వానం ప‌లుక‌గా టీవీవీ రాష్ర్ట కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ తిప్ప‌ర్తి యాద‌య్య అధ్య‌త వ‌హించారు. వేదిక న‌గ‌రాధ్య‌క్షులు శ్రీ‌ధ‌ర్‌దేశ్‌పాండె ప్రారంభోప‌న్యాసం చేయ‌గా, ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌, ప్రెస్ అకాడ‌మి చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ‌, సీన‌య‌ర్ జ‌ర్న‌లిస్టు టంక‌శాల అశోక్‌, ప్రొఫెస‌ర్ వైబి. స‌త్య‌నారాయ‌ణ‌, టీవీవీ రాష్ర్ట ఉపాధ్య‌క్షులు గురిజాల ర‌వీంద‌ర్‌రావు, డాక్ట‌ర్ వి. స్వ‌ర్ణ‌ల‌త‌, శివాజీ, దాన‌క‌ర్ణాచారి త‌దిత‌రులు వ‌క్త‌లు పాల్గొన్నారు. వేదిక రాష్ర్ట కార్య‌ద‌ర్శి యాద‌య్య అధ్య‌క్షోప‌న్యాసం చేస్తూ తెలంగాణ విద్యావంతుల వేదిక ఎన్నో ఒడిదొడుకులను అధిగ‌మించి మ‌లివిడుత జ‌రిగిన‌ మహ‌త్త‌ర తెలంగాణ‌ ఉద్య‌మంలో స‌మ‌న్త ప్ర‌జానీకాన్ని స‌మీక‌రించి ఐక్యం చేసింద‌న్నారు. స‌భ ప్రారంభోప‌న్యాసంలో వేదిక న‌గ‌రాధ్య‌క్షులు శ్రీ‌ధ‌ర్‌దేశ్‌పాండె మాట్లాడుతూ వేదిక ఏర్పాటు స‌మ‌యంలోనే భ‌విష్య‌త్‌కు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌పై ఒక స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌తో ఉంద‌ని అన్నారు. ఉద్య‌మంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్యుల‌ను చేసేందుకు ఎంతో కృషి చేసింద‌న్నారు. ప్ర‌జా చైత‌న్యం ప‌లు సంద‌ర్భాల్లో వ్య‌క్త‌మైంద‌ని, ఇప్ప‌టి సీమాంధ్ర సీఎం చంద్ర‌బాబునాయుడును ప్ర‌జ‌లు నిల‌దీశార‌ని గుర్తు చేశారు. ఉద్య‌మంలో క‌నీవిని ఎరుగ‌ని రీతిలో ప్ర‌జా చైత‌న్యం, సాంస్కృతిక వెల్లువ ఎగ‌సి ప‌డింద‌న్నారు. ఇదే చైత‌న్యాన్ని విధ్వంస‌మైన తెలంగాణ‌ను అభివృద్ధి చేసుకోవ‌డంలో ప్ర‌ద‌ర్శించి ముందుకు పోవాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్య‌మాన్ని బుద్దిజీవులు న‌డిపించార‌ని అల్లం నారాయ‌ణ అన్నారు. 69 ఉద్య‌మంలో భావ‌జాల వ్యాప్తి జ‌రుగ‌లేద‌ని, మ‌లివిడుత ఉద్య‌మంలో అది పెద్ద ఎత్తున జ‌రిగి ప్ర‌జ‌ల‌ను పోరాట మార్గాన్ని ప‌ట్టించింద‌న్నారు. రాష్ర్టం సిద్దించినా వ‌ల‌సాధిప‌త్యం నుంచి బ‌య‌టప‌డ‌లేద‌ని అన్నారు. దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం అంత సుల‌భం కాద‌ని చెప్పారు. దివంగ‌త జ‌య‌శంక‌ర్‌సార్ తెలంగాణ స‌మాజానికి విముక్తి ప్ర‌ధాత అని కొనియాడారు. విద్యుత్ జేఏసీ నాయ‌కుడు శివాజి మాట్లాడుతూ తెలంగాణ విద్యావంతుల వేదిక చేయాల‌నుకున్న‌దే చెబుతుంద‌ని, చెప్పింది త‌ప్ప‌క చేసి చూపిస్తుంద‌ని కొనియాడారు.తెలంగాణ స‌మాజం వేదిక‌పైపు చూస్తోంద‌ని అన్నారు. భ‌విష్య‌త్ తెలంగాణ అభివృద్ధి కోసం వేదిక అలుపెరుగ‌ని పోరాటం చేయాల‌ని ఆకాంక్షించారు. అనంత‌రం స‌భ‌కు హాజ‌రైన వ‌క్త‌ల‌కు శాల‌వ క‌ప్పి జ్ఞాపిక‌ల‌ను అంద‌జేశారు.                                                                            
మధు వెబ్ న్యూస్ రిపోర్టర్.... 
rcnjournalism@gmail.com
9392641999

No comments:

Post a Comment