All meadia

 

Friday, 19 September 2014

ఆకట్టుకుంటున్న సిల్క్ ఎక్స్ పో...

ఆకట్టుకుంటున్న లేపాక్షి,  చేనేత వస్త్ర ప్రదర్శన... 
ఈ ప్రదర్శన వచ్చే నెల  అక్టోబర్  2 వరకు వరకు కొనసాగనుంది... 
వివిధ రంగాలకు చెందిన 120 మంది కళాకారుల తయారుచేసి ప్రదర్శనలో ఉంచాం; మేనేజర్ 
సిల్క్ ఎక్స్ పోను ప్రారంభిస్తున్న దైవజ్ఞ శర్మ తదితరులు... 
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్;  వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది కళాకారులచే తయారు చేయబడిన సిల్క్  వస్త్రములు, అల్లికలు, కళాక ఉత్పత్తులు  ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మేనేజర్ చంద్రశేఖర్ రావు అన్నారు. లేపాక్షి హస్తకళా, చేనేత వస్త్ర ప్రదర్శన ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ లో  శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్న  దైవజ్ఞ శర్మ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో తెచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కక్కరు ఒక విధంగా తయారు చేసి ఆకట్టుకున్నారన్నారు.  వీటిని తయారు చేసిన వారు అమ్మడం గమనర్హం.  మహేశ్వరి, కోటా శారీస్, ఖాధీ, చీరాలా, బెంగాల్, ఫ్యాన్సీ,  జార్ఖండ్ సిల్క్,  బెనారస్ సిల్క్,  ఉప్పాడ, కలంకారి,  కాంతావర్క్, మంగళగిరి, ఒరిస్సా సిల్క్, చందేరి,  వెంకటగిరి, కాశ్మీర్ సిల్క్,  కాటన్ ప్రింటెడ్ వర్క్ శారీస్, బంధానీ సిల్క్ వివిధ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.  ఈ ఎగ్జిభిషన్ వచ్చే నెల 2 వరకు కొనసాగుతుందన్నారు. 
మరిన్ని ఫోటోలు... 

No comments:

Post a Comment