అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నం వడ్డిస్తున్న మాజీ ఎమ్మెల్యే విష్ణు

మాజీ ఎంపి అంజన్‌కుమార్‌ను సన్మానిస్తున్న ఏ. బాలయ్యయాదవ్, సురేందర్‌యాదవ్
మాజీ ఎంపి అంజన్‌కుమార్‌ను సన్మానిస్తున్న ఏ. బాలయ్యయాదవ్, సురేందర్‌యాదవ్
తెలంగాణ వెబ్‌న్యూస్, హైదరాబాద్ : యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరి చౌరస్తాలో వెంకటగిరి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణషే మండపంలో మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మురళీగౌడ్, రహ్మత్‌నగర్ కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, చిన్నగౌడ్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ నగర ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొని మత సామరస్యాన్ని చాటుకొంటారని అన్నారు. ఈ సందర్భంగా ఎంపి అంజన్‌కు విఘ్నేశ్వరుని ప్రతిమ జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటి చైర్మన్ ఏ. బాలయ్యయాదవ్, అధ్యక్షులు కె. రాములుయాదవ్, నాయకులు ఏ. సురేందర్‌యాదవ్, ఎంఏ. హమీద్, ఎన్. విజయ్‌కుమార్, అఫ్జల్‌ఖాన్, శ్రీశైలంయాదవ్, శ్రవాణ్‌కుమార్‌గౌడ్, రవియాదవ్, రాములు, చంద్రయ్య, రామస్వామి, గణేష్, వెంకట్, రాజు, రియాజ్, మల్లికార్జున్, సూర్యంపంతులు, క్రిష్ణ, నరేందర్‌యాదవ్, సంతోష్‌యాదవ్ పాల్గొన్నారు.
మధు వెబ్ న్యూస్ రిపోర్టర్....
rcnjournalism@gmail.com
9392641999
No comments:
Post a Comment