All meadia

 

Wednesday, 3 September 2014

విద్యావంతుల వేదిక ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను జ‌య‌ప్ర‌దం చేయండి : శ్రీ‌ధ‌ర్‌దేశ్‌పాండె


తెలంగాణ
 విద్యావంతుల వేదిక ద‌శాబ్ది ఉత్స‌వాల క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రిస్తున్న టీ వేదిక న‌గ‌ర నాయ‌కులు

 టీ వేదిక ఈసీ స‌మావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెస‌ర్ శ్రీ‌ధ‌ర్‌దేశ్‌పాండే, డాక్ట‌ర్ తిప్ప‌ర్తి యాద‌య్య‌

తెలంగాణ వెబ్ న్యూస్‌,హైద‌రాబాద్ :  తెలంగాణ విద్యావంతుల వేదిక ఆవిర్భ‌వించి ప‌ది వ‌సంతాలు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంగా ఈ నెల 14న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల‌లో ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వేదిక  నగర అధ్యక్షుడు శ్రీ‌ధ‌ర్‌దేశ్‌పాండె, డాక్ట‌ర్ తిప్ప‌ర్తి యాద‌య్యలు పేర్కొన్నారు. బుధ‌వారం హిమాయ‌త్‌న‌గ‌ర్‌లోని అమృతా ఎస్టేట్‌లో వేదిక న‌గ‌ర‌శాఖ‌ ఈసీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి వేదిక న‌గ‌రాధ్య‌క్షులు శ్రీ‌ధ‌ర్‌దేశ్‌పాండె ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ 2004 ఏప్రిల్‌లో తెలంగాణ‌ విద్యావంతుల వేదిక ఏర్పాటై ప‌దేళ్లు పూర్తి చేసుకుంద‌న్నారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంలో ద‌శాబ్ది ఉత్స‌వాలు జ‌రుపుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. వేదిక  ల‌క్ష్య సాధ‌న‌ల్లో ప్ర‌ధాన ల‌క్ష్యం ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు అని, ఆ ల‌క్ష్యం తీరింద‌న్నారు. ఇక రెండో ల‌క్ష్య‌మైన తెలంగాణ పున‌ర్నిర్మాణం మిగిలి ఉంద‌న్నారు. ఈ ప‌దేశ్ల కాలంలో వేదిక సీమాంధ్ర పాల‌కుల కుట్ర‌ల‌ను ఛేదించ‌డంలో అనేక ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్టింద‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని తెలంగాణ‌కు ద‌క్క‌కుండా వ‌ల‌స పాల‌కులు ఢిల్లీలో చేయ‌ని లాబీయింగ్ లేద‌ని గుర్తు చేశారు. ఇలాంటి ఎన్నో కుట్ర‌ల‌కు వెంట వెంట ప‌సిగ‌ట్టి చివ‌రికి హైద‌రాబాద్ న‌గ‌రాన్నిద‌క్కించుకోగ‌లిగామ‌న్నారు. అయినా కొన్ని కుట్ర‌ల‌ను తిప్పి కొట్ట‌డంలో కేంధ్ర ప్ర‌భుత్వ ఒత్తిడి మేర‌కు వెనుక‌బ‌డ్డామ‌న్నారు. ఉమ్మ‌డి రాజ‌ధాని, ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ పాల‌న, కొన్ని ఉమ్మ‌డి వ్య‌వ‌స్థ‌ల‌ విష‌యంలో మ‌న రాష్ర్టానికి ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. వీటి రద్దు కోసం పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ఉమ్మ‌డి వ్య‌వ‌స్థ‌ల ర‌ద్దుకోసం తెలంగాణ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో పోరాడాల‌ని, ఈ పోరాటానికి తెలంగాణ స‌మాజం కూడా అండ‌గా ఉండాల‌ని పిలుపునిచ్చారు. అర‌వై ఏళ్ల గాయ‌ప‌డ్డ తెలంగాణ‌ను అభివృద్ధి చేయడానికి టీ వేదిక ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తూ రాజీలేని పోరాటం చేస్తుందని ఆయ‌న స్స‌ష్టం చేశారు. తెలంగాణ ఉద్య‌మంలో గ‌డిచిన ప‌దేళ్ల పాత్ర‌ను మ‌దింపు చేసుకొని అదే చైత‌న్యంతో మ‌రింత క్రియాశీల‌క పాత్ర‌ను పోషించాల‌ని భావిస్తుంద‌న్నారు. మంచిర్యాల‌లో జ‌రిగే ద‌శాబ్ది ఉత్స‌వాల‌కు తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌లు, ప్ర‌జాస్వామిక‌వాదులు, ఉద్య‌మ‌కారులు పెద్ద ఎత్తున పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని వారు పిలుపునిచ్చారు. ఈ నేప‌ద్యంలో సెప్టెంబ‌ర్ 4 గురువారం బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగే ఉశాబ్ది ఉత్స‌వాల స‌న్నాహ‌క స‌భ‌కు భారీ సంఖ్య‌లో హాజ‌రుకావాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ద‌శాబ్ది ఉత్స‌వాల క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రించారు. స‌మావేశంలో వేదిక న‌గ‌ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌. విశ్వ‌నాథ్‌, నాయ‌కులు జ‌గ‌న్‌మోహ‌న్‌, క‌ట్టొజు మ‌ధు, ప్ర‌కాష్‌, విద్యాసాగ‌ర్‌, విన‌య్‌, ద‌యాక‌ర్‌రెడ్డి, తాటి జ‌గ‌దీశ్వ‌ర్‌నేత త‌దిత‌రులు పాల్గొన్నారు.

మధు వెబ్ న్యూస్ రిపోర్టర్.... 
rcnjournalism@gmail.com
9392641999

No comments:

Post a Comment