All meadia

 

Saturday, 23 August 2014

ఈ కామర్స్ పై గూగుల్ అనలైటిక్స్ పై మీట్

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; ఐడన్ ఎస్ఈవో గ్రూడ్ ఆధ్వర్యంలో ఈ కామర్స్, గూగుల్ అనలైటిక్స్ పై సదస్సును ఆదివారం బంజారాహిల్స్ లామాకాన్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా ఐడన్ ఎస్ఈవో గ్రూప్ సీఈవో చక్రపాని అనుముల ఈకామర్స్ ను ఉద్దేశించి  మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజితో షాపింగ్ కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ఆన్ లైన్ లోనే అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయన్నారు. అపారమైన మానవ వనరులు... సృజనాత్మతకు ఢొకాలేని మేధస్సు... ఇలాంటి మేధస్సుకు అవకాశం కల్పిస్తే... సృజనాత్మక ఆలోచనలతో అద్భుతాలు  సృష్టిస్తారని అన్నారు. కాలేజీ క్యాంపస్లే కొత్త కంపెనీల ఏర్పాటుకు వేదికలుగా మారితే... విద్యార్థులనే యజమానులుగా తీర్చిదిద్దితే....ఈ ఆలోచనలకు రూపమే... స్టార్ట్అప్ అని అన్నారు. డిజిటల్ మార్కెటింగ్ పై, గూగుల్ అనలైటిక్స్ పై 5 సంవత్సరాలు అనుభవం కలిగిన  వారు ఈ ఈకామర్స్ లో చంధ్రశేఖర్, రవీంధ్ర రెడ్డిలు మాట్లాడుతూ మొబైల్ కంపెనీలు కూడా సోషిల్ నెట్ వర్క్ ఆధారంగా చేసుకొని వారి వారి వ్యాపారలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ కామర్స్, గూగుల్ అనలైటిక్స్ గురించి వివరణ ఇచ్చారు. 

ఈ కామర్స్ సదస్సులో మాట్లాడుతున్న రవీందర్ రెడ్డి

No comments:

Post a Comment