(కేసీఆర్ ఫైల్ ఫోటో)
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ రేపు ఉదయం ఉ.8.30కి అధికారిక నివాసం నుంచి బయల్దేరనున్నారు. ముందుగా ఉ.8.50కి పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. ఉ.9.20కి గోల్కొండ కోటకు చేరుకోనున్న కేసీఆర్‌కు ప్రభుత్వ సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు స్వాగతం పలుకనున్నారు. తర్వాత ఉ.9.30కి జాతీయ పతాకావిష్కరణలో పాల్గొన్న అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఉ.9.30 నుంచి 10.30 వరకు ప్రసంగించిన అనంతరం కామన్వెల్త్ క్రీడల విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమాల తర్వాత గవర్నర్ ఆహ్వానం సాయంత్రం 5.30 కి రాజ్‌భవన్‌లో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొంటారు.

No comments:
Post a Comment