తెలంగాణ వెబ్ న్యూస్ ; తెలంగాణ పీడిత ప్రజల పక్షపాతి, కవి కాళోజి నారాయణరావు శతజయంతి వేడుకలను తెలంగాణ రాష్ర్ట మంతటా ఘనంగా జరుపాలని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 9న తెలంగాణ పది జిల్లాల ప్రజలు కాళోజి శతజయంతి వేడుకల్లో పాల్గొనాలని అన్నారు. తెలంగాణ ప్రాంతం వలసవాదుల చేతుల్లో తీవ్రంగా నష్టపోతోందని ప్రతి క్షణం ఆరాటపడి తన పెన్నునే గన్నుగా సీమాంధ్ర పాలనపై ఎక్కుపెట్టేవారని కాళోజిని కొనియాడారు. తెలంగాణకు ద్రోహం చేసేవాడు తెలంగాణ వాడైతే అక్కడే పాతర పెట్టాలని తెలంగాణేతరుడైతే ప్రాంతం వదిలే వరకు తరిమికొట్టాలని ప్రజలను చైతన్య పరిచిన గొప్ప కవి అని పేర్కొన్నారు.
No comments:
Post a Comment