All meadia

 

Saturday, 9 August 2014

విద్యా సదస్సు సన్మాన కార్యక్రమం...

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; దళిత గిరిజన టీచర్స యూనియన్ తెలంగాణ రాష్ట్రం కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సమావేశంలో కాలేజీ ప్రిన్సిపల్ గాలి వినోద్ కుమార్, పద్మశ్రీ అవార్డు గ్రహిత  రవికుమార్ గౌడ్, డిజిటియు సలహాదారు టి.అశీర్వాదంలు మాట్లాడుతూ బ్రిటీష్ పరిపాలన  కాలంలో అంబేద్కర్ చేసిన చేసిన సేవల గురించి వారు చర్చించారు. ప్రజలకు ఓటు హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చిన ఘనంత అంబేద్కర్ కే దక్కుతుందన్నారు. అప్పటిలో పేదరికంలో ఉన్నవారికి ప్రతి పౌరుడికి న్యాయం జరిగేలా తీర్పునిచ్చారన్నారు. 1949 నుంచి 1950 వరకు రాజ్యాంగ సభలో రాజ్యాంగం గురించి చర్చించారన్నారు. 1935 సంవత్సరంలో అంబేద్కర్  లేబర్ కమీషనర్ గా పని చేసి లేబర్లుగా పని చేస్తున్న ప్రజలకు అండగా నిలిచారన్నారు. అంబేద్కర్ నిర్ణయాలకు ఎవరు అడ్డు చెప్పలేదన్నారు. ఏ కార్మికుడైనా 8 గంటలు పని చేయాలని చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కేవలం అంబేద్కరే ప్రవేశపెట్టారన్నారు. అంబేద్కర్  క్రమశిక్షణ తెలియాలంటే అంబేద్కర్ రాసిన చరిత్రను చదవాలని పేర్కొన్నారు. మహిళలను ఇంటికే పరిమితం కాకుండా వారు కూడా యాథేచ్చగా సమాజంలో దైర్ఘంగా ముందుకు పోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోసాడ నర్సిహులు,  పట్నం శ్రీ మహేందర్ రెడ్డి, పెండ్యాల కొమురయ్య, పట్నం సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ళ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  చేవెళ్ళ శాసన సభ్యులు కాలె యాదయ్య,  సంజీవరావు, రాములు నాయక్, ఆర్.వెంకట్ రెడ్డి, ఊరెళ్ళ పోచయ్య,  ఇలిటం అంజయ్య తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment