విజ్ఞాన పరమార్థం సమాజహితం : స్పీకర్
మైత్రి మానవాళి జన్యువుల్లోనే : జేపీ
హైదరాబాద్: ఐ ఫోకస్ సంస్థ ఆధ్వర్యంలో మైత్రీవారధి పేరుతో రవీంద్రభారతిలో స్నేహితుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, లోక్ సత్తా జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ హాజరయ్యారు. స్పీకర్ మధుసూధనాచారి మాట్లాడుతూ విజ్ఞాన్ పరమార్థం సమాజహితం కావాలన్నారు. సాటి మనుషుల్ని గౌరవించే సమాజాన్ని నిర్మించుకోవాలన్నారు. మైత్రి మానవాళి జన్యువుల్లోనే ఉందని, కాదంటే నష్టపోతామని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. సమస్యలన్నీ చిన్నవేనని, సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందన్నారు.
No comments:
Post a Comment