తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; తెలంగాణ ప్రజల అరవై సంవత్సరాల కల ఇప్పటికి నెరవేరిందని, మహిళల కొత్తగా (ఎఎల్ఈటిఎస్) అసోసియేషన్)ను ప్రారంభించామన ఎం.సరికా రెడ్డి తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కె.సరిక, పోగుల గణేశం, వరలక్ష్మి, సుధీర్ లు మాట్లాడుతూ పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు వారికి ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని అభివృద్ది చెందాలన్నారు. అన్ని విధాలుగా వారికి సహాకారం అందించుటకు ఈ అసోసియేషన్ ను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment