తెలంగాణ వెబ్ న్యూస్, సనత్ నగర్; విద్యారంగ సమస్యల పరిష్కార సాధనకై విద్యార్థులంతా సంఘటితంగా ఉధ్యమించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు, ఫిలిం చాంబర్ దర్మక సంఘాల ప్రధాన కార్యదర్శి మద్దినేని రమేష్ బాబు అన్నారు. ఏఐఎస్ఎఫ్ 79వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఎస్ ఆర్ నగర్ సమితి ఆద్వర్యంలో ఏఐఎస్ఎఫ్ జెండాను ఎగురవేశారు. భగత్ సింగ్ చిత్రపటానికి ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు హర్షవర్ధన్ పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో విశాల్, వంశి, వినయ్, ప్రశాంత్, బంటి, రజినికాంత్, నాయకులు వినయ్, స్వరూప్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment