All meadia

 

Saturday, 23 August 2014

గోల్కొండ ప‌త్రికను పున‌రుద్ద‌రించాల‌నే ప్ర‌తిపాద‌న హ‌ర్ష‌ణీయం ; బి. భాస్క‌ర్‌సాగ‌ర్‌


తెలంగాణ వెబ్ న్యూస్, హైద‌రాబాద్‌...
తెలంగాణ‌కు మొట్ట‌మొద‌టి ప‌త్రిక గోల్కొండ దిన‌ప‌త్రిక‌ను పున‌రుద్ద‌రించాల‌ని లోకాయుక్త జ‌స్టీస్ సుభాష‌ణ్‌రెడ్డి ప్ర‌తిపాదించ‌డం హ‌ర్షించ‌ద‌గిన‌ద‌ని టీఆర్ఎస్ జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం యూత్ ప్రెసిడెంట్ బి. భాస్క‌ర్‌సాగ‌ర్ అన్నారు. రాజా బ‌హ‌ద్దూర్ వెంక‌ట‌రామారెడ్డి 146వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న స‌మ్మ‌తించారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం తెలంగాణ వెబ్‌న్యూస్ తో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌లు అన్ని విదాల మోస‌పోవ‌డానికి సీమాంధ్ర పాల‌కులతో పాటు వారి పెట్టుబ‌డిదారి పుత్రిక‌లైన సీమాంధ్ర‌ ప‌త్రికలు ప్ర‌ధాన పాత్ర పోషించాయ‌ని ఆరోపించారు. తెలంగాణాలో జ‌రుగుతున్న వాస్త‌వాల‌ను క‌ప్పిపుచ్చి అబ‌ద్ద‌పు ప్ర‌చారంతో అందిన కాడికి దోచుకోవ‌డంలో పత్రిక‌లు ముందున్నాయ‌ని చెప్పారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో రాజాబ‌హ‌దూర్ వెంక‌ట‌రామారెడ్డి  గోల్కొండ ప‌త్రిక‌ను స్థాపించి వాస్త‌వాల‌ను వెలికి తీసి తెలంగాణ స‌మాజాన్ని జాగృతం చేశార‌ని అన్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ పున‌ర్నిర్మాణం ఆవిశ్య‌క‌త నేప‌ద్యంలో తెలంగాణ రాష్ర్టంలో మ‌రిన్ని ప‌త్రిక‌లు, న్యూస్ ఛానెళ్లు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ప్ర‌త్యేక రాష్ర్టం ఏర్ప‌డిన‌ప్ప‌టికీ సీమాంధ్రుల కుట్ర‌లు మిగిలే ఉన్నాయ‌ని, వారి కుట్ర‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వెలికితీయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

No comments:

Post a Comment