All meadia

 

Saturday, 30 August 2014

వ‌చ్చింది బౌగోలిక తెలంగాణ‌నే : ఎంటీ ఖాన్ సంతాప‌స‌భ‌లో ప‌్రెస్ అకాడ‌మి చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ‌

ఎంటీ ఖాన్ సంతాస‌భ‌లో ప్ర‌సంగిస్తున్న ప్రెస్ అకాడ‌మి చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ‌
హ‌క్కుల నేత ఎంటీ ఖాన్ సంతాప‌స‌భ‌కు హాజ‌రైన ఉద్య‌మ‌కారులు, ప్ర‌జాస్వామిక‌వాదులు
తెలంగాణ వెబ్ న్యూస్‌, హైద‌రాబాద్ :  తెలంగాణ స‌మాజం కోరుకున్న రాష్ర్టం రాలేద‌ని కేవ‌లం బౌగోలిక తెలంగాణ మాత్ర‌మే వ‌చ్చింద‌ని తెలంగాణ రాష్ర్ట ప్రెస్ అకాడ‌మి చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు. శ‌నివారం బాగ్‌లింగంప‌ల్లిలోని సుంద‌ర‌య్య విజ్ఞానకేంధ్రంలో జ‌రిగిన హ‌క్కుల ఉద్య‌మ సార‌థి ప్ర‌జా ఉద్య‌మాల వార‌ధి ఖాన్‌సాబ్ సంతాస‌భ‌లో అల్లం నారాయ‌ణ పాల్టొని ప్ర‌సంగించారు. పౌర‌హ‌క్కు సంఘం రాష్ర్ట క‌మిటి ఏర్పాటు చేసిన ఈ సంతాపస‌భకు ఆ సంఘం రాష్ర్ట నాయ‌కులు ప్రొఫెస‌ర్ శేష‌య్య అధ్య‌త వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అల్లం నారాయ‌ణ మాట్లాడుతూ మ‌ధ్య‌త‌ర‌గ‌తి స‌ర్డుబాటు దోర‌ణి నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి ఎంటీ ఖాన్ స్పూర్తిగా నిలిచార‌ని అన్నారు. స‌భాధ్య‌క్షులు ప్రొఫెస‌ర్ శేష‌య్య‌ ప్రారంభోప‌న్యాసం చేస్తూ ఎంటీ ఖాన్ హ‌క్కుల ర‌థ‌సార‌థిగా అభివ‌ర్ణించారు. హ‌క్కుల ఉద్య‌మానికి ఆల‌య‌న లేని లోటు తీర‌నిద‌ని అన్నారు.   తాము చేసిన‌, చేయ‌ని వాటి గురించి తామే రాసుకొని, రాయించుకొని పుస్త‌కాలు ముద్రించుకొని మురిసి పోయేవారు ఎంద‌రో ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితిలో కూడా ఎంటీ ఖాన్ అందుకు బిన్నంగా ఎలాంటి వేష‌జాల‌కు పోకుండా నిరాడంబ‌ర‌త్వానికి, నిబ‌ద్ద‌త‌కు నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌ని కొనియాడారు. ప్ర‌త్యేకించి తెలంగాణాలోని హైద‌రాబాద్‌లో పురుడు పోసుకున్న ప్ర‌తి ఉద్యమంలోఆయ‌న భాగ‌స్వామ్యం ఉంద‌ని, ఉద్య‌మాల‌తోనే ఆయన ఎద‌గ‌డ‌మేకాదు ఆ ఉద్య‌మాల‌ను న‌లుదిక్కుల విస్త‌రించ‌డానికి ఎంతో కృషి చేశార‌ని గ‌త అనుభ‌వాల‌ను గుర్తు చేసుకున్నారు. సీనియ‌ర్ న్యాయ‌వాది బొజ్జాతార‌కం మాట్టాడుతూ పీడిత ప్ర‌జ‌ల‌ను అమితంగా ప్రేమించేవాడ‌ని అన్నారు. రంగుక‌ల‌, దాసి, భ‌ద్రంకొడుక త‌దిత‌ర సామాజిక చిత్రాల ద‌ర్శ‌కుడు, జాతీయ అవార్డు గ్ర‌హీత బి. న‌ర్సింగ‌రావు మాట్లాడుతూ విద్యార్థి ద‌శ నుంచే మ‌త విస్వాసాల‌కు దూరంగా ఉంటూ ప్ర‌జా పోరాటాల వైపు ప‌య‌ణించిన ఆద‌ర్శ‌ప్రాయుడు ఎంటి ఖాన్ అని, ఆయ‌న స్పూర్తిని కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. స‌భ‌కు హాజ‌రైన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు పాశం యాద‌గిరి, సినీ ద‌ర్శ‌కుడు ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి, సంద్య‌, విమ‌ల‌క్క‌, ఓపీడీఆర్ నాయ‌కుడు భాస్క‌ర్‌రావు, న్యూ డెమోక్ర‌సి నాయ‌కులు గోవ‌ర్థ‌న్‌, అరుణోద‌య రామారావు, ప‌ద్మ‌కుమారి, ముర‌ళి, ప్ర‌దీప్‌కుమార్‌, కోటి త‌దిత‌రులు ఎంటీ ఖాన్‌తో ఉన్న జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. స‌భ ప్రారంభానికి ఉందు పౌర‌హ‌క్కు ఉద్య‌మంలో అసువులు బాసిన అమ‌ర‌వీరుల‌కు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్ర‌జా క‌ళామండ‌లి క‌ళాకారులు పాడిన పాట‌లు సభికుల‌ను ఆలోచింప‌జేశాయి. గాయ‌కుడు గోర‌టి వెంక‌న్న ఆటా పాట స‌భ‌కు ప్ర‌త్యేక ఆక‌ర్శ‌న‌గా నిలిచింది. హ‌క్కుల సంఘం నేత‌లు, ప్ర‌జాస్వామిక‌వాదులు పెద్ద‌ ఎత్తున హాజ‌ర‌య్యారు

తెలంగాణ వెబ్ న్యూస్ క‌ర‌స్పాండెంట్ క‌ట్టోజు మ‌ధు

No comments:

Post a Comment