ఈ నెల 20వ తేదిన తన అనుచరులతో టీఆర్ఎస్ లో చేరిక
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; అధికారంలో ఉన్నా లేకున్నా సమస్యల కోసం నిరంతరం పాటుపడుతుంటానని వైఎస్సార్ సీపీ నాయకురాలు విజయారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు వైఎస్సార్ సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల సీమాంధ్ర పార్టీలో ఉన్నప్పటికీ తను ముమ్మాటికి తెలంగాణ వాధినేనని అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయారెడ్డి తన రాజకీయ భవిష్యత్ ను ప్రకటించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్, మెట్టు రాజు, రజినికాంత్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి దానంకు దడ....
మాజీ మంత్రి దానం నాగేందర్ ముఖ్య అనుచరులతో పాటు కార్యకర్తలు విజయారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే విజయారెడ్డితో చర్చలు జరిపి పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో విజయారెడ్డి చేరికతో టీఆర్ఎస్ పార్టీ బలపడటమే కాకుండా మాజీ మంత్రి దానం నాగేందర్ కు ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

No comments:
Post a Comment