All meadia

 

Thursday, 3 September 2015

పనిమంతులకు పరీక్షలు

బడి పిల్లలకే కాదు.. ఇకపై ఎమ్మెల్యేలకు నెలవారీ, లేదా మూడు మాసాలకు ఒకసారి అసలు సిసలు పరీక్ష తప్పేటట్టు లేదు. ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరును సర్వే రూపంలో సేకరించి మైనస్‌ మార్కులను తగ్గించుకునే క్రమంలో తెలుగుదేశం సరికొత్త ప్రయోగం చేస్తోంది. ఇంతకుముందే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే పనితీరును అంచనా కట్టినప్పుడు రాష్ట్రస్థాయిలోనే మన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తొలి ఆరు ర్యాం కులు దక్కించుకున్నారు. సహజంగానే ఇది మిగతా జిల్లాలపై ప్రభావం చూపింది. గోదా వరి జిల్లాలకంటే మేం తక్కువా అనే రీతిలో మిగతా జిల్లాల్లో ఎమ్మెల్యేల మధ్య పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇకముందు విడతల వారీగా సర్వేలు కొనసాగబోతున్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు, సరికొత్త విధానాలు, సత్వర ప్రతిస్పందన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే జిల్లాలో ఎమ్మెల్యేలు ఇప్పటికీ తమ పదవి ఒక హోదాగా కాకుండా ఒక బాధ్యతగా నిత్యం ఏదొక వినూత్న విధానాన్ని నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టేందుకు పోటీ పడుతున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే వంద రోజుల కార్యక్రమాన్ని ప్రకటించి ఈ స్వల్ప వ్యవధిలోనే నేరుగా ఇంటింటికి మరుగుదొడ్డి, సంపూర్ణ పారిశుధ్యానికి తొలి అడుగు వేశారు.

No comments:

Post a Comment