All meadia

 

Wednesday, 2 September 2015

రోడ్డెక్కని బస్సులు...ప్రయాణికుల అవస్థలు

సార్వత్రిక సమ్మె ప్రభావంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. పలు జిల్లాల్లో కార్మికసంఘాల నేతలు ర్యాలీలు జరిపారు. నల్గొండ జిల్లాలో సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. భువనగిరి పారిశ్రామికవాడలోనూ బంద్‌ కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆరు డిపోల్లో 600 బస్సులు నిలిచిపోయాయి. సింగరేణి కార్మికులు సైతం సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తి నిలచిపోయింది. మెదక్‌ జిల్లాలో వామపక్షాల కార్యకర్తలు ఆందోళన చేపట్టాయి. ఆర్టీసీబస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలోని పది భూగర్భ గనులు, నాలుగు ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలచిపోయింది. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట సీఐటీయూ నాయకులు బైఠాయించారు. చిత్తూరు జిల్లాలోనూ ఆర్టీసీబస్సుల రాకపోకలు నిలచిపోయాయి. వరంగల్‌ జిల్లాలో 9 ఆర్టీసీ డిపోల్లో వెయ్యి బస్సులు ఆగిపోయాయి.

No comments:

Post a Comment