All meadia

 

Tuesday, 1 September 2015

కోస్తా, తెలంగాణల్లో వర్షాలు

ఒడిసానుంచి కోస్తా మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడనద్రోణి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో కోస్తా, తెలంగాణల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం వరకు పాలకుర్తి, మహబూబాబాద్‌లలో ఎనిమిది, వీరఘట్టంలో ఏడు, నాగిరెడ్డిపేట, మెదక్‌, ఎల్లారెడ్డిల్లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, తెలంగాణ, సీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.

No comments:

Post a Comment