All meadia

 

Wednesday, 2 September 2015

బల్బులో ఉల్లి ఘాటు

సమాజానికి చక్కటి సందేశాల్ని తన కళారూపాలు ద్వారా సృజనాత్మకంగా అందిస్తున్న సూక్ష్మ శిల్పకళాకారుడు గంధవళ్ల ఉమాశంకర్‌ తాజాగా ఉల్లిపై కళారూపం తయారు చేశారు. మధ్య తరగతి కుటుంబాలు ఉల్లిపాయల కోసం పడుతున్న ఆవేదనను దీనిద్వారా ప్రభుత్వాలకు తెలియజేశారు. సుద్ధతో ఉల్లిపాయ నమూనా, ఉల్లిరేటుకు తల్లడిల్లుతున్న సామాన్య పౌరుడిని బల్బులో ఇమిడ్చి తన కళా ప్రతిభను ప్రదర్శించారు. త్వరలో ఉల్లి రేటు సామాన్యుడికి అందుబాటులోకి రావాలని ఈ శిల్పం ద్వారా ఆయన ఆకాంక్షించారు.

No comments:

Post a Comment