All meadia

 

Wednesday, 9 September 2015

ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపుకు కేంద్రం ఆమోదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుభత్యాన్ని 6 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే బంగారం బాండ్ల పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 5, 10, 50, 100 గ్రాముల లెక్కన బాండ్ల జారీకి నిర్ణయం తీసుకుంది. బంగారం స్థానంలో ఆర్‌బీఐ బాండ్లను ఇవ్వనుంది.
 
ఉద్యోగులకు కరువుభత్యం ప్రస్తుతం 113 శాతం కాగా, పెంపునకు ఆమోదముద్ర పడటంతో119 శాతానికి చేరుతుంది. దీనివల్ల దేశంలోని కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. ఈ ఏడాది ఏప్రి ల్‌లో 107 శాతంగా ఉన్న కరువుభత్యాన్ని 6 శాతం పెంచిన ప్రభుత్వం, దాన్ని జనవరి నుంచి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
 
మూలవేతనం ప్రాతిపదికగా లెక్కించే కరువు భత్యం తాజా పెంపుపై కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడా ది జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. నిరుడు జూలై 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 30 వరకుగల 12 నెలల పారిశ్రామిక కార్మిక-వినియోగదారు ధరల సూచీ సగటు ఆధారంగా ఈ పెంపును నిర్ణయిస్తారు.

No comments:

Post a Comment