All meadia

 

Thursday, 3 September 2015

పేదలను భయపెడుతున్న మంత్రి తలసాని

రాణీగంజ్‌ కాలనీ కస్తూర్బానగర్‌లోని స్లమ్‌ ఏరియా జీనావాలా కాలనీ కాంపౌండ్‌ స్థలంపై కన్నేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అక్కడ నివసిస్తున్న పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి మర్రి శశిధరరెడ్డి ఆరోపించారు. పట్టాలున్న పేద కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించేందుకు కుట్ర జరగుతోందన్నారు. బస్తీవాసులతో కలిసి కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా, నగర పోలీస్‌ కమిషనర్‌ ఎం. మహేందర్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. 1998లో 3(1), 3(2) ద్వారా నోటిఫికేషన్‌ చేయించి కుటుంబాలకు పొజిషన్‌ పట్టాలు ఇచ్చినట్టు తెలిపారు. కాలనీలో ఇళ్లు నిర్మిస్తామని మాట ఇచ్చిన తలసాని ఆ తర్వాత మాట మార్చారని అన్నారు. కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తమ రక్షణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను వారు కోరారు.

No comments:

Post a Comment