తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;
డిజిటల్ హైదరాబాద్, డిజిటల్ తెలంగాణా కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెట్రోపొలిస్ సదస్సులో తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు...11వ మెట్రో పోలీస్ మూడో రోజు సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొన్నకేటీఆర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ పరిపాలన అందించడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఎన్ని సవాళ్లున్నాయో.. అంతకంటే ఎక్కువ అవకాశాలూ ఉన్నాయని కేటీఆర్ అన్నారు. తాజాగా తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే గురించి ఈ సదస్సులో ప్రస్తావించారు. గ్రామీణ స్థాయి నుంచి మెట్రో నగరాల వరకు అభివృద్ధిలో సమగ్ర, కచ్చితమైన సమాచారం అవసరమని తెలిపారు. ఇందుకోసమే తాము సమగ్ర సర్వే జరిపి బిగ్-డాటా సేకరించామని వివరించారు. తెలంగాణా రాష్ట్రంలో 39శాతం పట్టణ జనాభా ఉన్నదని, వారికి ఉత్తమ పాలన అందించడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. స్మార్ట్ సిటీస్ అంటే.. స్మార్ట్ సిటిజన్ సర్వీసెస్ అందించేదే స్మార్ట్ సిటీ అని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీలో ఉత్తమ నైపుణ్యం కల్గిన మానవ వనరులు, నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు సాగేలా స్మార్ట్ సిటీస్ ఉండాలని ఆయనన్నారు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్‌కి బిగ్ డాటా ఉపయోగపడితే.. వైపరీత్యాల నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

బైట్.. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), తెలంగాణా రాష్ట్ర మంత్రి
No comments:
Post a Comment