సదర్ వేడుకలకు హాజరు కావాలని పొన్నాల లక్ష్మయ్యకు ఆహ్వన పత్రికను అందజేస్తున్న జికె రాజశేఖర్
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;
జగద్గిరిగుట్ట యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29న జరగనున్న సదర్ వేడుకలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ సంఘం అధ్యక్షుడు జె.కె.శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలోని పలువురు శనివారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ యాదవ్, జగద్గిరిగుట్ట యాదవ సంఘం నేతలు ఎ.పెంటయ్య యాదవ్, బి.అశోక్‌యాదవ్, జి.జగదీష్‌యాదవ్, దుర్గేష్, టి.యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment