తెలంగాణ వెబ్ న్యూస్; హైదరాబాద్ ; భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కేంద్ర మాజీ హోం మంత్రి వల్లభాయ్ పటేల్ జన్మదినమైన అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను 1969 తెలంగాణ ఉధ్యమకారుల సమాఖ్య కో కన్వినర్ కొల్లూరి చిరంజీవి అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కొల్లూరి చిరంజీవి మాట్లాడుతూ 1948లో పోలీస్ యాక్షన్ పేరుతో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలోో జరిగిన సామూహిక ఊచకోతలకు నాటి హోం మంత్రి వల్లభాయ్ పటేలే కారణమని చెప్పారు. ఇండియన్ యూనియన్ నిజాం ప్రభుత్వం మధ్య ఉన్న స్టాండ్ గ్రిల్ అగ్రిమెంట్ ను కాదని.... నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, కేంద్ర మంత్రి మండలి అనుమతి లేకుండానే పోలీస్ యాక్షన్ పేరుతో హైదరాబాద్ పై దాడికి ఇండియన్ ఆర్మీని పంపింది వల్లభాయ్ పటేలే అన్నది చారిత్రక వాస్తవమని చెప్పారు. ఆపరేషన్ పోలో, క్యాటర్ పిల్లర్ పేరుతో హైదరాబాద్ లోని అన్ని వర్గాల ప్రజలపై జరిగిన దాడులకు పటేలే కారణమని, వేలాది కుటుంబాలు నాశనమయ్యాయని తెలిపారు. మహత్మ గాంధీ, అంబేద్కర్ లాంటి జాతీయ నాయకులకన్నా పటేల్ ను గొప్పగా చిత్రీకరించడానికి వెనక ఉన్న కుట్రను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు శ్రీధర్ ధర్మసనం, ఎల్.పాండురంగా రెెడ్డి, ఎన్.రాందాస్, శ్రీరాం కన్నెకంటి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment