భారత్‌లో త్వరలో్నే పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కాకుండా నగరపాలక
సంస్థలకే పోలీస్ అధికారాలు కేటాయించే అవకాశాలున్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఉన్న విధానంపై ఇపుడు మెట్రోపాలిస్ సదస్సులో చర్చకు
రావడంతో పాత డిమాండ్‌కు మరింత ప్రాచుర్యం కలిగింది. స్వయంగా ఈ విషయాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే ప్రస్తావించడంతో ఈ అంశానికి
ప్రాధాన్యత కలిగింది.
* భారత్‌లో త్వరలో మున్సిపల్ పోలీసులు
* విదేశీ విధానాన్ని అవలంభించే అవకాశం
* నగర భద్రత ఆ మున్సిపల్ పరిధిలోనే ఉండే అవకాశం
* విధివిధానాలకు కొంత సమయం పట్టే అవకాశం
మెట్రోపాలిస్ వేదిక సాక్షిగా మరోసారి పోలీస్ వ్యవస్థ మార్పులపై చర్చ జరిగింది. విదేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న విధానాన్నే ఇక్కడా
ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నగరాల్లో శాంతి భద్రతలు అత్యంత కీలకంకావడంతో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల
అనుమతి తీసుకోవాల్సి వస్తుంది ఇప్పటిదాకా. దీంతో, కొన్ని సమస్యలు వస్తున్నాయన్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం గతంలోనే దీనికి ఓ
పరిష్కార మార్గం కనుగొనాలని భావించింది. ఇందుకు విదేశాల్లో ఉన్న స్థానిక నగరపాలక సంస్థలకే పోలీస్ అధికారాలు ఇవాలని భావించింది. ఎందుకో తర్వాత ఈ విషయంపై తిరిగి చర్చ జరగలేదు. తాజాగా హైద్రాబాద్‌లో జరుగుతోన్న మెట్రోపాలిస్ అంతర్జాతీయ సదస్సులో ఈ విషయం
మరోసారి చర్చ లేవనెత్తారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఈ విషయాన్ని తనకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తు చేశారన్నారు వెంకయ్య
నాయుడు.
బైట్: వెంకయ్యనాయుడు (కేంద్రమంత్రి)...ఈ రోజు మెట్రోపాలిస్ సదస్సు ఫీడ్‌లో ఉంటుంది.
ఎండ్‌వాయిస్ : ఇప్పటికిపుడు నిర్ణయం తీసుకోకపోయినా, త్వరలోనే ఈ విషయంపై విధివిధానలు రూపొందించి అమలు చేసే అవకాశం ఉంది.
No comments:
Post a Comment